Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మండల పరిధిలోని అడ్లూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఉపసర్పంచ్ లచ్చిరెడ్డిని ఇన్చార్జి సర్పంచ్‌గా బుధవారం గ్రామస్తుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. గ్రామ సర్పంచ్‌గా ఉన్న అంబడిపుడి స్వరాజ్యం అనారోగ్యంతో మార్చి 25 వ తేదీన మతి చెందారు. అనంతరం జెట్టి లచ్చిరెడ్డిని వార్డు మెంబర్లు గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి అండదండలతో గ్రామ అభివద్ధికి తన వంతు కషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు పింగళి నాగమణి శ్రీనివాస్ రెడ్డి, వీర కుమారి సైదిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ వీరారెడ్డి, పెదకూరకొండలో పింగళి వెంకటేశ్వర్ రెడ్డి, జెట్టి వెంకటేశ్వర రెడ్డి, కష్ణారెడ్డి, పుల్లారెడ్డి, ఉసిరికాయల కొండలు తదితరులు పాల్గొన్నారు.