Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాదైనా మోక్షం కలిగేనా ?
నవతెలంగాణ -చివ్వేంల
రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కానీ ఇది క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు సాధించకపోగా అభాసుపాలు అయింది. అఏండ్లు గడుస్తున్న ఆశించిన మేర లబ్ధిదారులకి ఇండ్ల కేటాయింపు జరగకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతప్తి నెలకొంది. మండలానికి ఒకటి,రెండు గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొన్ని చోట్ల నిర్మాణం పూర్తయిన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ అధికారులకు తలనొప్పిగా మారింది. ఇండ్ల నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా లబ్దిదారుల ఎంపిక పూర్తి కాలేదు.డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకొని నెలలు గడుస్తున్నా లబ్ధిదారుల ఎంపిక జరగక పోవడంపై ప్రజలు తీవ్ర అసంతప్తితో ఉన్నారు.
ఈ ఏడాది కేటాయింపు జరిగేనా!
చివ్వేంల మండలం మోదిన్ పురం గ్రామంలో 50 డబుల్ బెడ్ రూం ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. వీటి నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్నా ఇంకా కేటాయింపు జరగలేదు. ప్రభుత్వం గ్రామస్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం కోసం గత ఏడాది చివరి నెలలో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం యిచ్చింది. గ్రామస్తులు దరఖాస్తులు చేసుకొని సుమారు మూడు,నాలుగు నెలలు గడుస్తున్న లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు.ఈ ఏడాది అయినా ప్రభుత్వం ఇల్లు కేటాయిస్తుందో లేదోనని గ్రామస్తులు ఆశతో ఎదురుచూస్తున్నారు...
ఆశించిన మేరకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరగక పోవడంతో ప్రభుత్వం ప్రజల్లో ఉన్న అసంతప్తిని తగ్గించేందుకు కొత్త ఆలోచన చేసినట్లు పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. మండలంలో మొత్తం 31 గ్రామపంచాయతీలు ఉండగా తిరుమలగిరి గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేశారు.. మోదిన్ పురం గ్రామంలో డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యి పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి .మిగతా 29 గ్రామాల ప్రజల నుంచి అసంతప్తి తలెత్తే అకాశం ఉన్నట్లు అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సమస్య తలెత్తుతుందని భావించిన ప్రభుత్వ పెద్దలు స్థలం ఉన్నవారికి మూడు లక్షలు ఇంటి నిర్మాణం కోసం మంజూరు చేస్తామని ప్రకటించి ప్రజల్లో ఉన్న అసంతప్తిని చల్లార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సంక్రాంతి కాగా నే ఈ పథకాన్ని అమలులోకి తెస్తామని రాష్ట్ర మంత్రులు ప్రకటించిన ప్పటికీ ఇప్పటి వరకు ఈ పథకం అమలులోకి రాకపోవడం స్థానికంగా ఉండే నేతలకు తలనొప్పిగా మారిందని అభిప్రా యాలు వ్యక్తం అవు తున్నాయి. జాప్యం చెయ్యకుండా డబల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ చేయాలి... కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధారావత్ వీరన్న నాయక్...
ప్రభుత్వం మోదిన్ పురం గ్రామంలో నిర్మించిన డబల్ బెడ్ రూం ఇండ్లను కాలయాపన చేయకుండా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారులను వెంటనే ఎంపిక చేయాలి. పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి నిజమైన లబ్దిదారులకు డబల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయాలి. ఖాళీ స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయల పథకాన్ని వెంటనే అమలు చేయాలి... చైతన్య యువజన మండలి అధ్యక్షులు బాషిపంగు సునీల్ ఖాళీ స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షలు మంజూరుచేయాలని అధికారికంగా మార్గదర్శకాలు జారీ చేయాలి.