Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో వరి కోతలు ప్రారంభం అయినందున ప్రభుత్వం అన్ని గ్రామాలలో యుద్ధ ప్రాతిపాదికన ఐకెేపీ కేంద్రాలను ఏర్పాటు చేసి రైతాంగం పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక వెంకట నరసింహారెడ్డి భవన్ లో జరిగిన ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో వరి కోతలు ప్రారంభించి 15 రోజులు అవుతున్న నేటికి ఐకెేపీ కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంట వేసి బస్తాలను లిఫ్ట్ చేసి బిల్లులు వెంటనే వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. ఇటీవల అకాల వర్షాల మూలంగా జిల్లాలో అనేక గ్రామాలలో వేలాది ఎకరాలలో వరి పంట పూర్తిగా దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటకు ప్రభుత్వం ఎకరాకు 20వేల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. వరి పంటకు మద్దతు ధర కల్పించి రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మతి చెందిన ఆ పార్టీం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు సునీత్ చోప్రా కు పార్టీ జిల్లా కమిటీ పక్షాన సంతాపం తెలియజేశారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దిరావత్ రవి నాయక్, మట్టి పెళ్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, కోట గోపి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు, మండల కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.