Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ఇన్చార్జి నెల్లికంటి సత్యం
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరి స్తున్న రాజ్యాంగ,లౌకిక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 18 నుంచి నియోజకవర్గంలో చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం చేయాలని ఆ పార్టీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి నెల్లికంటి సత్యం కోరారు.గురువారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నదుల అనుసంధానం పేరుతో మునుగోడు, దేవరకొండ నియోజక వర్గాలకు సాగునీరు రాకుండా అడ్డుపడుతుందన్నారు. దేశ ప్రజలకు చెందాల్సిన సహజ వనరులైన గ్యాస్ పెట్రోలియం డీజిల్ వంటివి ఆదాని చేతిలో పెడుతుందన్నారు. వ్యవసాయ రంగాన్ని దివాళికించేందుకు మోటార్లకు మీటర్లు పెట్టి రాష్ట్రాల హక్కులను హరిస్తుందన్నారు.మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు.ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బచనగోని గాలయ్య,ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు కే.శ్రీనివాస్,మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్,నాయకులు చిలువేరు అంజయ్య,పొట్ట శంకరయ్య,కలకొండ సంజీవ,మంచాల జంగయ్య,పల్లె మల్లారెడ్డి, కందుల లింగమ్మ,వీరమల్ల యాదయ్య,పొట్ట సత్యం,కురుమిద్ద కళమ్మ,దుబ్బాక సంజీవ, కొప్పు సుధాకర్,మంచాల సైదులు, తదితరులు పాల్గొన్నారు.