Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దివిస్ జియం పెండ్యాల సుధాకర్
- దివిస్ పరిశ్రమను సందర్శించిన సర్పంచులు
నవతెలంగాణ - చౌటుప్పల్రూరల్
చౌటుప్పల్ మండల పరిధిలోని గ్రామాల సర్పంచి లు గురువారం దివిస్ పరిశ్రమను సందర్శించారు. పరిశ్రమలోని ఈటిపి ప్లాంట్,కంపనీ పరిసరాలను పరిశీలించారు.భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మండలంలోని గ్రామాలను వదిలి పక్క మండలాల గ్రామాలకు సిఎస్ఆర్ నిధులు కేటాయించడం పట్ల కొంత మంది సర్పంచ్ లు ఆవేదన వ్యక్తంచేశారు.అన్ని గ్రామాలకు నిధులు ఇవ్వాలని జియం పెండ్యాల సుధాకర్ కోరారు. సర్పంచ్ ల సూచనలపై సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మునుగాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పరిశ్రమ లోపల నిర్వహణ ఆధునిక పరికరాలతో చేస్తున్నారని తెలిపారు.మండలంలోని గ్రామాల అభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి తోడ్పాటును అందిస్తుందని అన్నారు. ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్వహణ బాగుందని మెచ్చుకున్నారు.పరిశ్రమ జియం పెండ్యాల సుధాకర్ మాట్లాడుతూ పరిశ్రమ యాజమాన్యం సామాజిక బాధ్యతగా భావించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.పరిశ్రమలో వ్యర్థ రసాయనాలు శుద్ధి చేయడానికి ఆధునిక టెక్నాలజీతో ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్వహణ చేస్తున్నామని తెలిపారు.పరిశ్రమలో భద్రత మాసోత్సవాల సందర్భంగా ప్రజాప్రతినిధులను, విద్యార్థు లను దశల వారిగా పరిశ్రమకు ఆహ్వానించి,పరిశ్రమ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరియు రక్షణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈటిపి ఏజీయం రాఘవేంద్ర రావు, సేఫ్టీ మేనేజర్ మహేష్, హెచ్ ఆర్ సూపర్వైజర్ శివప్రసాద్,కిషోర్, సర్పంచ్ లు బాతరాజు సత్యం, కొర్పురి సైదులు, చౌట వేణు, రిక్కల ఇందిర సత్తిరెడ్డి,కొలను శ్రీనివాస్ రెడ్డి, కాయితి రమేష్,చిరిక రాణి రంగారెడ్డి, మిర్యాల పారిజాత గోపాల్, ముద్ధం సావిత్రి సత్తయ్య, పెద్దిటి హేమలత చంద్రారెడ్డి, వాకిటి భూలక్ష్మిభూపాల్ రెడ్డి, ఆవుల రేణుక, నారెడ్డీ అండాలు, గుర్రం కొండయ్య, బక్క స్వప్న శ్రీనాథ్, చిన్నం లావణ్య తదితరులు పాల్గొన్నారు.