Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి
నవ తెలంగాణ- భువనగిరి రూరల్
మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ కెవి.భూపాల్ రెడ్డి తెలిపారు. గురువారం కాన్ఫరెన్స్ హాలులో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ బిసి, దళిత సంఘాల ప్రతినిధులతో మహాత్మా జ్యోతిబా ఫూలే 197 జయంతి వేడుకల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.వివిధ సంఘాల ప్రతినిధులు తమ సలహాలు, సూచనలు తెలియచేస్తూ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకునేలా చర్యలు తీసుకోవాలని, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వివిధ సంఘాల ప్రతినిధులను వేడుకలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాలేజీల విద్యార్ధులకు మహనీయుల చరిత్ర తెలిసేలా వారిని వేడుకలలో భాగస్వామ్యం చేయాలని అన్నారు. బీసీ సంక్షేమ భవనం కోసం స్థలం మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఇన్ఛార్జీ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అన్ని సంఘాల ప్రతినిధుల సమన్వయ సహకారంతో భువనగిరి పట్టణంలో జగదేవపూర్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈసమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి యాదయ్య, కలెక్టరేట్ సూపరింటెండెంట్ గిరిధర్, వివిధ సంఘాల ప్రతినిధులు బంటు రామచంద్రయ్య, కొత్త నర్సింహ్మ, ఎ లక్ష్మినారాయణ గౌడ్, ఏశాల అశోక్, కడారి వెంకటేశ్, రావుల రాజు, తంగళ్ల రవికుమార్, జె.ప్రవీణ్, మాటూరి అశోక్, ఎ.వెంకటేశ్ గౌడ్, భాస్కర్ నాయక్, రమేశ్ గౌడ్, జి.వసంత, కొత్త బాలరాజు, ఎ వెంకటరత్నం, జగన్మోహన్ లు పాల్గొన్నారు.