Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని గొర్రెల మేకల పెంపకదారుల సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం, అవిసెట్టి శంకరయ్య అన్నారు. గురువారం గట్టుపల మండల కేంద్రంలో గొర్రెల, మేకల పెంపకదారుల సంఘం ఆధ్వర్యంలో మండల తహసిల్దార్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2004 సంవత్సరంలోఆనాటి ప్రభుత్వం గోపాల కృష్ణ గొర్రెల, మేకల పెంపక దారుల సహకార సంఘానికి అప్పుడు ఐదు ఎకరాల భూమి ఇచ్చిందన్నారు. ఆ భూమిని అప్పుడు అమ్మిన వారు, వారి పేరు మీద 20 గుంటల భూమిని అక్రమంగ తన కుమారుడి పేరుపై ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వెంటనే రద్దు చేయాలని కోరారు. సర్వేనెంబర్ 234/అ /2 ఖాతా నెంబర్60451 దాసరి వెంకటయ్య, దాసరి యాదయ్య వీరిద్దరి తండ్రి పేరు రాములు అని, ఆనాడు ప్రభుత్వం వీరిద్దరి వద్దభూమిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత నాలుగు ఎకరాల 20 గుంటల భూమి సూచిస్తుందని, దాసర వెంకటయ్య కుమారుడు దాసరి శ్రీకాంత్ పేరు మీద అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఆ రిజిస్టర్ వెంటనే రద్దు చేయాలని గట్టుప్పల తహసీల్దార్‌ను కోరగా, వారు వెంటనే స్పందించి, ఆ భూమిని పట్టా కాకుండా సొసైటీకి దక్కేలా ప్రయత్నం చేస్తానని తెలిపారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు జెర్రిపోతుల ధనంజయ గౌడ్, అంతపేట సొసైటీ అధ్యక్షులు దాసరి రమేష్, సురిగి రాఘవేందర్, యాదయ్య, సైదులు, శివయ్య,, బిక్షమయ్య, లక్ష్మయ్య, దోమల అంజయ్య, దండిగా సోమయ్య, మల్లయ్య, సురిగి బిక్షమయ్య, నల్లవెల్లి చంద్రయ్య, నల్లవెల్లి ముత్యాలు, మల్లేష్, లింగస్వామి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.