Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-మర్రిగూడ
సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షులు బీటీ రణధీవే స్ఫూర్తితో కార్మికులంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్న పాక లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం రణదీవే 33వ వర్ధంతి సందర్భంగా చలో ఢిల్లీలో భాగంగా తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు. ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతి, వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 6 నుండి 14 వరకు సామాజిక న్యాయవారోత్సవాలు ఉంటాయని తెలిపారు. మతం పేరుతో దేశభక్తి ముసుగులో బీజేపీి ప్రభుత్వం మత కల్లోలాలు సృష్టించే విధంగా కుట్ర పండుతుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లు రద్దు చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం చూస్తుందని తెలిపారు. బీజేపీి ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని కోరారు. ఈనెల 11న మహాత్మ జ్యోతిరావు పూలే, 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను కార్మికులంతా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ అఖిల భారత పిలుప ుమేరకు ఈ నెల 10 నుండి 14 వరకు సామాజిక సమస్యలపై వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పులయాదయ్య, ఊరి పక్కవెంకటయ్య, సునీత, మంజుల, ముత్తమ్మ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : ఐక్య పోరాటాల వారిదిగా సీఐటీయూ కార్మిక సమస్యలపై నిరంతరం పోరాడుతుందని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అన్నారు. గురువారం కార్మిక ఉద్యమ నేత, సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షులు బీటీ.రణధీవే 33వ వర్ధంతి సందర్భంగా స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, నూకల జగదీష్ చంద్ర, భవాండ్ల పాండు, రవినాయక్, తిరుపతి రామ్మూర్తి, రాగిరెడ్డి మంగారెడ్డి, లింగమయ్య, పగిడోజు రామ్మూర్తి, పల్లా బిక్షం, కోడిరెక్క మల్లయ్య, సోమయ్య, కందుకూరి రమేష్, జగన్నాయక్, ఏసు, రామారావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
దామరచర్ల : సీఐటీయూ వ్యవస్థాపకులలో ఒకరైన బీటీ రణధీవే వర్థంతి వేడుకలను దామరచర్ల మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి బైరం దయానంద్, మార్కెట్ అమాలి సంఘం అధ్యక్షులు కార్యదర్శులు పర్వతాలు రాం మల్లయ్య, పగిడి వెంకటేశ్వర్లు, జీడయ, సీఐటీయూ సహాయ కార్యదర్శి ఎస్కే సుభాని, వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.
కేతపల్లి :సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు బీటీ రణధీవే వర్థంతి సందర్భంగా గురువారం సీఐటీయూ కేతేపల్లి మండల కమిటీ కన్వీనర్ ఆది మల్ల సుధీర్, కార్మికులు ఆయనకు జోహార్లు అర్పించారు. రణదీవే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్మికులు సైదులు, బిక్షం, బద్రయ్య, లింగయ్య, వెంకన్న పాల్గొన్నారు.