Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్య తెలంగాణనే లక్ష్యంగా హెల్త్ క్యాంపులు
- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలడని ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదని, ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని మహా భాగ్యంగా భావించాలని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మహిళా జర్నలిస్టులకు గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఆరోగ్య తెలంగాణనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, వారికోసం రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ క్యాంపులు నిర్వహిస్తోందని, కంటి వెలుగు కార్యక్రమం, మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని మహిళా జర్నలిస్టుల కోసం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్త్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో గల అక్రిడిటేటెడ్ మహిళా జర్నలిస్టులతో పాటు, పత్రికా, న్యూస్ ఛానెళ్లలో పనిచేస్తూ ఆర్గనైజేషన్ గుర్తింపు కార్డులు ఉన్న మహిళా జర్నలిస్టులకు కూడా నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్ లో వివిధ పరీక్షలు నిర్వహించారు. ఈ మాస్టర్ హెల్త్ చెకప్‌లో రక్త పరీక్ష , బ్లడ్ షుగర్, డయాబెటిక్ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్, కాల్షియం, మూత్ర పరీక్షలు, క్రియా టిన్, ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, ఈసీజీ, ఎక్స్-రే, అల్ట్రాసోనోగ్రఫీ, మామోగ్రామ్, పాప్ స్మెర్ వంటి రోగనిర్ధారణ పరీక్షలతో పాటు, స్క్రీనింగ్ పరీక్షలు, మెడికల్ ఆఫీసర్ ఎగ్జామినేషన్, ఐ స్క్రీనింగ్, గైనకాలజీ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిమల్ కొండలరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో వేణుగోపాల్‌రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చు నాయక్, డీపీఆర్ఓ శ్రీనివాస్, మహిళ జర్నలిస్టులు ఎం.వరుణ, పీ. పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.