Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోతె
తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజీ వ్యవహారంలో భాగస్వామ్యం వహించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ను కఠినంగా శిక్షించి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు.శుక్రవారం మండలపరిధిలోని ఇవాళపురం గ్రామంలో నిర్వహించిన గ్రామ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడారు.తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కష్టపడి కుటుంబాలకు దూరంగా ఉండి ఉన్నంత ఉద్యోగం చేయాలన్న తపనతో అనేకమంది నిరుద్యోగులు శిక్షణాకేంద్రాలకు వెళ్లి ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసిన తర్వాత పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రావడం దారుణమన్నారు.వెంటనే బండి సంజరును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి ముల్కూరు గోపాల్‌రెడ్డి,మండల కమిటీ సభ్యులు జీఎస్ నాగమల్లయ్య, ఎం.సాగర్‌రెడ్డి,మణెమ్మ, శ్వేత, వెంకన్న, వెంకటరెడ్డి పాల్గొన్నారు.