Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ బండ ప్రకాశ్
నవతెలంగాణ- భువనగిరిరూరల్
దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలు ఆర్థికాభివద్ధి సాధిస్తున్నాయని, సంతోషంగా ఉన్నాయని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాలో దళిత బంధు పథకం ద్వారా లబ్ది పొందుతున్న వారిని స్వయంగా కలిసి వారు చేస్తున్న వ్యాపార వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాజపేట మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన కేశాపురం సౌందర్య పది లక్షలతో కొలనుపాకలో ఏర్పాటు చేసుకున్న మూడు యూనిట్లు కాంక్రీట్ మిల్లర్, ఆటో ట్రాలీ, టైలర్ షాపులను వారు పరిశీలించారు. తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి చెందిన బత్తుల ఉపేంద్ర భువనగిరి పట్టణంలో నెలకొల్పిన సబ్ డీలర్ షాపు, ఫ్రాంచెస్ ఏజెన్సీ షాపులను పరిశీలించారు. వారి బిల్లులను పరిశీలించారు. నెలవారి టర్నోవర్ 25 నుండి 30 లక్షలతో ఉండి నలుగురికి పనికల్పించడం పట్ల సంతప్తి చెంది శాలువాతో లబ్దిదారుని సన్మానించినారు.వలిగొండ మండలం కెరుచుపల్లి గ్రామానికి చెందిన బోడ మమత భువనరి పట్టణం హౌసింగ్ బోర్డులో ఏర్పాటు చేసిన కిరాణా షాపును చూశారు.రామన్నపేట మండలం కుంకుడుపాముల గ్రామానికి చెందిన పులిగిల్ల సైదులు చిట్యాలలో ఏర్పాటు చేసిన ఫుట్ వేర్ షాపును పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మెన్్ దళిత బంధు లబ్దిదారులను సన్మానించి మాట్లాడుతూ దళితుల జీవితాలలో ఆర్థిక వెలుగులు నింపాలని, వారు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు లబ్ధి పొందిన దళిత కుటుంబాలు ఆర్థికంగా ముందంజలో ఉన్నాయని, ఈరోజు డ్రైవరుగా ఉన్నవాళ్లు ఓనర్లు అయ్యారని, బట్టల షాపులో పనిచేసే వారు బట్టల షాప్ సొంతంగా పెట్టుకున్నారని తెలిపారు.ఇప్పుడు తాము సొంతంగా షాపులకు యజమానులయ్యామని, సంతోషంగా ఉన్నామని లబ్ధిదారులు చెబుతున్నారని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేరు చిరస్థాయిగా ఉండేలా దళిత బంధు పథకం ద్వారా దళితులంతా ఆర్థిక అభివృద్ధితో, స్వయం సాధికారతతో వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జినుకుల శ్యాంసుందర్, సంబంధిత గ్రామాల పంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు.