Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
తిరుమలగిరి మున్సిపల్కేంద్రంలో శుక్రవారం ప్రాథమికఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ కోటాచలం పాల్గొని మాట్లాడారు. ప్రజలు అరోగ్య పట్ల శ్రద్ద తీసుకోవాలని, ప్రతి ఉదయం,సాయంత్రం వేళలో నడక, యోగా, వ్యాయామం చేయాల న్నారు.ఎక్కువగా చిరుధాన్యాలతో కూడిన ఆహారం ఎక్కువగా తీసు కోవాలన్నారు.జింక్ ఫుడ్ నుండి దూరంగా ఉండాలని, ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ బిచ్చునాయక్, డాక్టర్ వాసవి, సూపర్వైజర్ రామచంద్ర, నర్సిం హారెడ్డి,శ్రీలత,రమాదేవి,సంధ్యారాణి, ధనమ్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.