Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
ఉపాధ్యాయుల పెండింగ్ డీఏలు విడుదల చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు జి.సదానందంగౌడ్ డిమాండ్ చేశారు.శుక్రవారం ఆసంఘం భవన్లో సూర్యాపేట జిల్లా ప్రథమ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు బంధం వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జాప్యం లేకుండా వెంటనే పీఆర్సీ కమిటీని వేయాలన్నారు. బదిలీలు, ప్రమోషన్లు వేసవి సెలవుల్లోనే చేపట్టాలన్నారు.పెండింగ్ ఏరియాస్ నుండి డీఏలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలన్నారు.పదవతరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీలో బాధ్యులైన ఉపాధ్యాయులను తొలగించండం సరైన చర్య కాదన్నారు.సీసీఏ రూల్స్ ప్రకారం సస్పెండ్ చేస్తే సరిపోతుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఓరుగంటి నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు కేవీ.సత్యనారాయణ, మాశెట్టి శ్రీనివాస్, పి.వెంకటేశ్వర్లు,రాంరెడ్డి, బూర వెంకటేశ్వర్లు, ఎ.శ్రీనివాస్, బి.పవన్ తదితరులు పాల్గొన్నారు.