Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
కొండమల్లేపల్లి సాగర్ రోడ్లో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీలకు రెండవ ఆదివారం కావడంతో విద్యార్థినీల తల్లిదండ్రులు విద్యార్థినులను కలిసి పోయేందుకు పాఠశాల వద్దకు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా వాచ్మెన్ లోనికి అనుమతి లేదని గేటు తీయకపోవడంతో గంటల తరబడి పాఠశాల గేటు ముందే నడి ఎండలో నిలబడి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా ప్రిన్సిపల్ ఫోన్లో ఈ వారం పిల్లలను కలిసేందుకు అనుమతి లేదని ప్రతి విద్యార్థిని తల్లిదండ్రులకి ఫోన్లో మెసేజ్లు పంపామని చెప్పారు. దీంతో విద్యార్థులకు తీసుకొచ్చిన ఆహారాన్ని తల్లిదండ్రులు తిని వెనుతిరిగి నరాశతో వెళ్లారు.