Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిరావు పూలే 197 వ జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా మునుగోడుకు చెందిన బీసీ ఉద్యమకారుడు, బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి విజయ్, మునుగోడు మండలం బీరెల్లిగూడెం గ్రామానికి చెందిన బూడిద మల్లికార్జున్ యాదవ్‌ను నియమిస్తూ బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పూలే ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్లుగా నియమితులైన వారు మాట్లాడుతూ...తమ సేవలను గుర్తించి రాష్ట్ర కన్వీనర్లుగా ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. పూలేఆలోచన విధానాలు, భావజాల వ్యాప్తి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ నెల 11 వ తేదీన రవీంద్రభారతిలో జరిగే పూలే జయంతిని విజయవంతం చేయాలని, ప్రతి గ్రామంలో, మండల కేంద్రంలో జయంతి కార్యక్రమాలు చేయాలని కోరారు. అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, నియామకానికి సహకరించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.