Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి పంటకు ప్రకటించిన మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే బోర్ల కింద సాగుచేసిన వరి ధాన్యం కటింగ్ చేస్తున్నారని చెప్పారు. ఆయకట్టు ప్రాంతంలో కూడా వరి కోతలు ప్రారంభించిన ప్రభుత్వం నేటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు మధ్య దళారీలకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేద వ్యక్తం చేశారు. ఇప్పటికే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో దశలవారీగా రైతు ఉద్యమాలు చేస్తున్నామని తెలిపారు. రైతాంగ సమస్యలపై సీపీఐ(ఎం) స్వతంత్రంగా ఉద్యమం చేపడతుందని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోతే పెద్ద ఎత్తున రైతుల సమీకరించి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. తక్షణమే జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీలతో, రైతు సంఘాలతో, మిల్లర్లతో జాయింట్ సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.