Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ కోటాచలం
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆర్ఎంపీలు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ కోటాచలం అన్నారు.జిల్లా అధ్యక్షుడు పుప్పాల లక్ష్మినర్సయ్య అధ్యక్షతన ఆదివారం స్థానిక ఐఎంఎ ఫంక్షన్హాల్లో జరిగిన తెలంగాణ ఆర్ఎంపీ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా 11వ మహాసభలో ఆయన మాట్లాడారు.ఆర్ఎంపీలందరికి మండలాలలో, గ్రామాలలో సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తామన్నారు.గుండెపోటు వచ్చిన సమయంలో చేయాల్సిన సీపీఆర్‌పై అవగాహన కల్పించారు.గుండెనొప్పి వఛ్చిన వ్యక్తి చాతిమీద గట్టిగా అదుముతూ, నోటిలోకి గాలిని పంపింగ్ చేయాలని చేసి చూపించారు.గ్రామాల్లో ఆపదలో ఉన్న ప్రజలకు గ్రామీణ వైద్యులు ప్రథమ చికిత్స చేసి ఎంతోమంది పేదల ప్రాణాలు కాపాడుతున్నారని, వారి సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా కేసారం నందు సంఘ భవన నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.ఆర్ఎంపీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ 428ని అమలు చేసి గ్రామీణ వైద్యులకు కమ్యూనిటీ పారా మెడికల్ శిక్షణ ఇచ్చి ,గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు.వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు, పసునూరి సత్యనారాయణ,ఎండి.గఫార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి రాజేందర్, రహమతుల్లా, చిలువేరు చంద్రయ్య, బెల్లంకొండ డాంగెగౌడ్, ఎల్లె వెంకటేశ్వర్లు, జెర్రిపోతుల లక్ష్మణ్‌గౌడ్, గూకంటి రాజబాబురెడ్డి, ఎస్.కృష్ణ, రవీంద్రాచారి,బండారు వీరన్న, కుమ్మరివెంకన్న, ఎస్కె నాగుల్‌మీరా, రేసు ఉపేందర్, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.