Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
భూమి కారవాన్‌లో భాగంగా భూ న్యాయ నిపుణులు ప్రొఫెసర్ సునీల్ బృందం సోమవారం మండలంలోని గుడిమల్కాపురం, కొత్తపేట కాలనీ, దేవిరెడ్డి గూడెం, పుట్టపాక గ్రామాలలో పర్యటించింది.రాచకొండ ప్రాంత రైతులను కలిసి భూ సమస్య వల్ల వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పలుమార్లు దరఖాస్తులు పెట్టుకున్న తమ సమస్యలు పరిష్కారం కావడంలేదని రైతులు వాపోయారు.అనంతరం స్థానిక రెవిన్యూ కార్యాలయం తాసిల్దార్ తో భూ అర్జీ లపై చర్చించి వాటికీ ప్రభుత్వం ధరణి లో తీసుకుంటున్న పరిష్కారలను తెలుసుకున్నారు.అంతకు ముందు రాచకొండ ప్రాంతం లోని సర్వేనెం.192,273 లో అసైన్డ్ పట్టా పొంది సాగు చేసుకుంటున్న దళిత,గిరిజన,వెనుకబడిన వర్గాలకు చెందిన సాగు రైతులతో సమావేశమయ్యారు. అనంతరం దేవిరెడ్డి గూడెం వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామ నిర్మాణంకు శ్రీకారం చుట్టిన మద్ది నారాయణరెడ్డి మనుమడు దేవిరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ధరణి సమస్యల వేదిక రాష్ట్ర కన్వీనర్ మన్నే నర్సిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏపూరి సతీష్,గ్రామ శాఖ అధ్యక్షులు జక్కిడి చంద్రారెడ్డి,రైతులు చెక్క నరసింహ, దుర్గం వెంకటేష్,పులగోని నరసింహ,మినుగు గోపాల్,యాదయ్య,రాములు,నోముల ఎట్టయ్య,నల్లబోతు యాదయ్య, శికిలమెట్ల బిక్షం,ఉప్పరగోని యాదయ్య,లింగయ్య, నరసింహ,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.