Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
టాస్క్ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు పెంపొందుతాయని శ్రీ గాయత్రి డిగ్రీ కళాశాల చైర్మెన్ బండారు మయూర్‌రెడ్డి, కరస్పాండెంట్ భీమిడి సుభాశ్రెడ్డిలు తెలిపారు. సోమవారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని శ్రీ గాయత్రి డిగ్రీ కళాశాలలో టాస్క్-రుబికన్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ ప్రోగ్రామంలో విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, జాబ్ స్కిల్స్, ఇంప్రూవ్ స్కిల్స్, కోడింగ్ స్కిల్స్, సమస్య పరిష్కార పద్ధతులు, జీవన నైపుణ్య పద్ధతి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టిప్స్, ఒత్తిడిని తట్టుకునే పద్ధతులపై టాస్క్ వారు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునే సమస్యను పరిష్కరించుకుంటూ పోవచ్చని, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందన్నారు. అన్ని రంగాల్లో ఉన్నత ఉద్యోగ స్థాయిలో బాగా రాణించగలుగుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చెన్నగాని అంజనేయులు, అధ్యాపకులు అనంతచారి, హరికృష్ణ, సంతోశ్, శ్రీను, అనూష, జ్యోతి, సంధ్య, మల్లిఖార్జున్, తిరుమలేశ్, రాజేశ్, రూప, విద్యార్థులు పాల్గొన్నారు.