Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరు టౌన్
సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఆలేరు పురపాలక సంఘం లోని ఆరో వార్డు బహుదూర్ పేటలో 96 లక్షల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లు లాంటివి అని , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను రాష్ట్రంలో ప్రతి ఇంటికి చేరుతున్నాయి అని చెప్పారు. బహదూర్ పేట లో ప్రధాన సమస్యలను పరిష్కరించడం కోసం దొంతుల లక్ష్మణ్ ఇంటి నుండి శ్మశాన వాటిక వరకు , స్ట్రాం వాటర్ డ్రైన్ నిర్మాణమును. నిర్మాణ పనులకు ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి శరవేగంగా సాగుతుందన్నారు.ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేశం , వార్డు కౌన్సిలర్ రాయపురం నర్సింహులు, పట్టణ సెక్రటరీ జెనరల్ కుండే సంపత్, ఆర్ ఎస్ ఎస్ అధ్యక్షులు కుళ్ల వెంకటేష్, జంపాల దశరథ, ,వార్డు అధ్యక్షులు వస్పరి బాలయ్య, యూత్ అధ్యక్షులు పల్లె మహేష్, దొంతుల ఎల్లేష్, రాయపురం శేఖర్, జెట్టా బాలనర్సయ్య, వట్టిపల్లి లక్ష్మణ్, వస్పరి శివ కుమార్, కిట్టు, సుధాకర్, గజరాజు సంపత్, దాసి సంతోష్, మొరిగాడి వెంకటేష్, పత్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.