Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
నవతెలంగాణ - భువనగిరి
మహాత్మా జ్యోతిబా పూలే దార్శనికుడని, అలాంటి మహనీయులు వేసిన బాటలో ఇప్పుడు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తున్నామని భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే 197 వ జయంతి వేడుకలు పట్టణంలోని జగదేవ్ పూర్ చౌరస్తా వద్ద ఘనంగా జరిగాయి. భువనగిరి శాసనసభ్యులు, మునుగోడు శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ చైర్మెన్‌్ కంచర్ల రామకృష్ణా రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, జెడ్పీటీసీలు కె.నగేష్, బీరు మల్లయ్య, అనురాధ, ఎంపీపీనరాల నిర్మల, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు, అధికారులు మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ. జ్యోతిబా పూలే చదువు గొప్పతనం గుర్తించి పాఠశాలలు స్థాపించి స్త్రీ విద్య, బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసం ఆయన నిరంతరం పాటుపడ్డారన్నారు. మునుగోడు శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జ్యోతిబా పూలే ఆదర్శవాది అని, సమాజం, వ్యవస్థ బాగు కోసం ఆయన పాటుపడ్డారని, వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఆచరిస్తూ ముందుకు వెళ్లాలన్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి మాట్లాడుతూ జ్యోతిబా పూలే విద్యతోనే చైతన్యం వస్తుందని గ్రహించి విద్యను ఒక శస్త్రంగా వాడారని, దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితమే అప్పటి సమాజంలో తన భార్య సావిత్రిబాయి పూలేకు చదువు చెప్పి అధ్యాపకురాలిగా తీర్చిదిద్దారని తెలిపారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మెన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపుల అమరేందర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ అందరివారని, అత్యున్నతంగా గౌరవింపబడే మహనీయులన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఆంజనేయులు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బికూనాయక్, జడ్పీటీసీలు కె.నగేశ్, బీరు మల్లయ్య, అనురాధ, ఎంపీపీ నిర్మల, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, తంగళ్ళపల్లి రవికుమార్ వివిధ బిసి, దళిత, మైనారిటీ సంఘాల ప్రతినిధులు మిర్యాల శ్రీనివాస్, మాటూరి అశోక్, బంటు రామచంద్రయ్య, బర్రె జహంగీర్, కడారి వెంకటేష్, రావుల రాజు, కొత్త నరసింహస్వామి, దేవరకొండ నరసింహ చారి, కొత్త బాలరాజు, బలరాం, ఏశాల అశోక్, కృష్ణ, వసంత, నరసింహ గౌడ్, కల్లూరి మల్లేశ్, జూపల్లి రవీందర్, వెంకటేశ్వర్లు, సంతోష్ కుమార్, సురేష్, శ్రీకాంత్, మాయ కృష్ణ, అతహర్, మాటూరి బాలరాజు , కొత్త బాలరాజు, కొత్త నరసింహాచారి, తంగేళ్ల రవికుమార్, వసంత, నరసింగరావు తదితరులుమాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వెంకటరెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారి యాదయ్య, జిల్లా ఎక్సైజ్ అధికారి నవీన్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యాంసుందర్, జిల్లా ఎస్.సి. అభివృద్ధి అధికారి జయపాల్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ నాగిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సామాజిక వివక్షతలకు ఎదురె¸డ్డి నిలిచిన ధీరుడు
మహాత్మ జ్యోతిరావు పూలే
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి
కొండమడుగు నర్సింహ
అక్షరాలను ఆయుధంగా చేసుకొని సమాజంలోని అణగారిన వర్గాల జీవితాల్లో అఖండ అక్షర జ్యోతులు వెలిగించి చైతన్యపరిచిన మహనీయుడు సామాజిక వివక్షతలకు ఎదురొట్టి నిలిచిన ధీరుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కృష్ణ తెలియజేశారు. మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆయా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి కాలంలోనే మహిళల విద్యకు ప్రాధాన్యత ఇచ్చి సావిత్రిబాయి పూలేని వివాహమాడి వారికి చదువు నేర్పి దేశంలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది మహిళలకు పేదలకు సామాజిక తరగతులకు విద్య నేర్పిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని అన్నారు. మహిళలకు చదువుకునే హక్కు, ఓటు హక్కు, సమానత్వం కోసం పోరాడిన మహోన్నతమైన వ్యక్తి అని అన్నారు. నేడు బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాదానికి వ్యతిరేకంగా నేటికీ కొనసాగుతున్న కులవ్యక్ష వ్యతిరేకంగా మహాత్మ జ్యోతిరావు పూలే స్ఫూర్తితో పోరాటాల కొనసాగిద్దామని నర్సింహ, కృష్ణ పిలుపునిచ్చారు.
ఆలేరు రూరల్ : సామాజిక వివక్షతలకు ఎదురొడ్డి నిలిచిన ధీరుడు అక్షరాలను ఆయుధంగా చేసుకుని సమాజంలోని అణగారిన వర్గాల జీవితాల్లో అఖండ అక్షర జ్యోతులు వెలిగించి చైతన్యపరిచిన మహానీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అని డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్ ,కాంటెస్ట్ ఎమ్మెల్యే కల్లూరి రామచంద్రారెడ్డి అన్నారు .మంగళవారం మండలంలోని కొలనుపాక గ్రామంలో సోమేశ్వర ఆలయానికి వెళ్లే దారిలో మహాత్మ జ్యోతిరావు పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణకు హాజరై ఈ సందర్భంగా సభాధ్యక్షులు నాగరాజు తుంగ కుమార్ ఆధ్వర్యంలో ముందుగా విగ్రహాలకు పూలమాలలు వేసి ఆవిష్కరించారు .మాట్లాడుతూ పూలే అంబేద్కర్ గురువు అని చాటి చెప్పడం నిజమన్నారు .పూలే భార్యను చిన్న వయసులో పెళ్లి చేసుకుని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత పూలేకి దక్కిందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ..ఈ కార్యక్రమంలో అడిషనల్ ఏ ఎస్పీ యాదయ్య, ఎంపీపీ గంధ మల్ల అశోక్ ,ఏడి రాంప్రసాద్ ,గ్రామ సర్పంచ్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు బక్క రాంప్రసాద్, మండల పార్టీ అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ ,మాజీ ఎంపిటిసి అంజయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింలు ,మాజీ సర్పంచులు ఐలయ్య ,సోమయ్య ,జై భీమ్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆలేరు టౌన్ : మండల కేంద్రంలో మంగళవారం ఆ మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు సునీత మహేందర్ రెడ్డి, సుధా గాని ఫౌండేషన్ చైర్మన్ సుధా గాని హరి శంకర్ గౌడ్, మున్నూరు కాపు సంఘం పట్టణ అధ్యక్షుడు ఎలుగల స్వామి, టీఎంకే జేయు జిల్లా కన్వీనర్ యేలగల కుమారస్వామి పటేల్,ప్రధాన కార్యదర్శి యేలుగాల అంజయ్య, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు కొలుపుల హరినాథ్ , టీఎస్ ఎమ్మార్పీఎస్ మల్లేష్ వైయస్సార్ తెలంగాణ, గ్యార నరేష్ , బీఎస్పీ మొరిగాడి శ్రీశైలం, సంఘీ నవీన్ , బిజెపి పట్టణ అధ్యక్షులు బడుగు జాంగిర్, చి రిగ శ్రీనివాస్, బహుదూర్ పేటలో వార్డు కౌన్సిలర్ రాయపురం నరసింహులు, కుండే సంపత్, కూల వెంకటేష్,చిత్రపటానికి, విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం, ఆడెపు బాలస్వామి, సంతోష్,చిరిగె శ్రీనివాస్, పో రెడ్డి ప్రసాద్, మైదాం భాస్కర్,కందుల యాదగిరి, చిరుగా రాంనర్సయ్య, పత్తి రాములు, తోట వెంకటయ్య, లక్కాకుల మహేష్, పగడాల శ్రీనివాస్,ఎల్లయ్య,పూల శివ, పులిపలుపుల మహేశ్ గౌడ్, రాజు, అయిలి సందీప్ గౌడ్ పాల్గొన్నారు.
వలిగొండ : మండల కేంద్రంలోని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. బీసీ సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ,వివిధ ప్రజా సంఘాల నాయకులు సిర్పంగి స్వామి, దుబ్బ దానయ్య, రాపోల్ పవన్ కుమార్, పెరమండ్ల యాదగిరి, మామిళ్ల రత్నయ్య, శీలం స్వామి,గంగారం రమేష్,ఎల్లంకి మహేష్, సలిగంజి బిక్షపతి, ఎర్ర మహేష్, పల్లేర్ల రామచంద్ర, సుద్దాల సాయికుమార్, శ్రీకాంత్, కందుల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.