Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివక్షలేని సమానత్వ సమాజం కోసం అహర్నిశలు కృషి
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
దేశానికి వెలుగు ప్రసాదించిన మహనీయుడు మహాత్మాజ్యోతిబా ఫూలే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జ్యోతిబాఫూలే జయంతి సందర్భంగా సూర్యాపేటలోని ఫూలే విగ్రహానికి మంత్రి నివాళులర్పించారు.అనంతరం కలెక్టర్ ఎస్.వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ సామాజిక దార్శనికుడుగా, సంఘసంసర్తగా, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన క్రాంతికారుడు ఫూలే అని స్మరించుకొన్నారు. వివక్షలేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిబాఫూలే అని కొనియాడారు.2014కు ముందు పాలించిన పాలకులు ఫూలే ఆశయ సాధనకు వ్యతిరేఖంగా పాలన కొనసాగిస్తే,జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు.సబ్బండవర్ణాల సాధికారత, సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.వెనకబడినవర్గాల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థను ఏర్పాటుచేసి, అన్ని నియోజకవర్గాల్లో బీసీ గురుకులాలు నెలకొల్పిందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేక గురుకులాలను స్థాపించిందన్నారు.మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టిందని చెప్పారు.బలహీనవర్గాల విద్యార్థుల విదేశీ ఉన్నత విద్యాభ్యాసానికి ఫూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద ఒక్కొక్కరికి రూ.20 లక్షల వరకు ఆర్థికసాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు. బహుజనుల కోసం ప్రత్యేకంగా ఆత్మగౌరవ భవనాలను నిర్మించిన కేేసీఆర్ పభుత్వం బీసీ వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వివరించారు.ముందుగా కలెక్టర్ వెంకట్రావ్, జెడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపిక, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ మాట్లాడుతూ జ్యోతిబాఫూలే స్ఫూర్తితో ప్రభుత్వం ఎన్నో పథకాలను పెట్టి బడుగు బలహీనవర్గాలను ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు ఈరోజు మేము ఇలా ఉండటానికి కారణం ఆ మహాత్ముడి ఆశయాలేనని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్,ఎస్.మోహన్‌రావు, వైౖస్చైర్మెన్ గోపగాని వెంకట్‌నారాయణగౌడ్, డీసీఎంఎస్ చైర్మెన్ వట్టెజానయ్యయాదవ్, మాజీ మున్సిపల్ చైర్మెన్ జుట్టుకొండ సత్యనారాయణ, కార్మికనాయకులు వైవీ, బీసీసంక్షేమసంఘం నాయకులు సత్యనారాయణ పిల్లే, చల్లమల్ల నర్సింహ, శారదాదేవి, ఎమ్మార్పీఎస్ నాయకులు చినశ్రీరాములు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తల్లమళ్ళ హస్సేన్, తప్పెట్ల శ్రీరాములు,స్థానిక కౌన్సిలర్ కక్కిరేణిశ్రీనివాస్, పట్టణ కౌన్సిలర్లు తాహేర్‌పాషా, రాజేష్, అభినరు, జ్యోతి శ్రీవిద్య, మున్సిపల్ కమీషనర్ రామానుజులరెడ్డి, ఆర్డీవో రాజేంద్రకుమార్, బీసీ సంక్షేమ అధికారి అనసూయ, డాక్టర్ రామూర్తి యాదవ్,తదితరులు పాల్గొన్నారు.
మహాత్మాజ్యోతిరావుఫూలే జీవితం స్ఫూర్తిదాయకం
సూర్యాపేట:సామాజిక ఉద్యమకారులు మహాత్మ జ్యోతిరావు ఫూలే జీవితం నేటితరానికి స్ఫూర్తి దాయకమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు అన్నారు.ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కార్యాలయంలో నిర్వహించిన మహాత్మాజ్యోతిబాఫూలే జయంతినుద్దేశించి ఆయన మాట్లాడారు.సామాన్య కుటుంబంలో పుట్టిన ఫూలే ఈ దేశంలో తరతరాలుగా అట్టడుగు వర్గాలు అనుభవిస్తున్న దోపిడి, పీడన, వివక్షలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారని ఆయన సేవలను కొనియాడారు.దేశం అభివృద్ధి కావాలంటే కేవలం విద్య ద్వారానే సాధ్యమవుతుందని నమ్మి విద్య ప్రజలందరికీ దక్కాలని ఆశ్రమ పాఠశాలలు నిర్వహించి చదువు చెప్పారన్నారు.నేటి యువత ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోటగోపి, జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండవెంకటేశ్వర్లు, ఎల్గూరి గోవింద్, జిల్లపల్లి నర్సింహారావు, వీరబోయిన రవి,చిన్నపంగనర్సయ్య, కల్లుగీత కార్మికసంఘం జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు,జిల్లా నాయకులు గుండగాని శ్రీనివాస్, మల్లయ్య, వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.