Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
ఇటీవల కాలంలో నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాగండ్ల శ్రీధర్‌ను సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రైతు సంఘం రాష్ట్ర నాయకులు పారెపల్లి. శేఖర్ రావు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ ఎల్లప్పుడూ రైతాంగానికి అందుబాటులో ఉంటూ, సకాలంలో రైతులకు కావలసిన విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచాలని దళారీ వ్యవస్థని రూపుమాపాలని కోరారు. సబ్సిడీపై వచ్చే వ్యవసాయ పరికరాలను క్షేత్రస్థాయిలో రైతులకు అందించేలా చూడాలన్నారు. మార్కెట్ పరిధిలోని వ్యవసాయ పంట పొలాలకు వెళ్లే లింక్ రోడ్ల అభివద్ధి కొరకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్ నాయకులు కుంకు తిరుపతయ్య, నీలా రామ్మూర్తి, పాతూరి శ్రీనివాసరావు తాడోజు శ్రీనివాసు, కొండపల్లి వరలక్ష్మి, పొనుగోటి శ్రీనివాసరావు, ఎడ్ల సైదులు అనిగంటి మీనయ్య గుర్రం ఏసు శ్రీను తదితరులు పాల్గొన్నారు.