Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండమల్లేపల్లి
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కొండమల్లేపల్లి పట్టణంలో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు జెడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగంధర్‌రెడ్డి సాయంత్రం మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌నాయక్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీ ముస్లిం సోదరుల అభివద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగారెడ్డి, ఎన్. రాంబాబునాయక్, ఎలిమినేటి సాయి, ఉపసర్పంచ్ గంధం సురేష్, నజీర్ మౌలానా, వసుకుల కాశయ్య మైనార్టీ మత పెద్దలు ఎంఏ సలాం,ముజీఫ్, గౌస్, ఎంఏ నజీర్, ఎండి ఖాదర్, తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు.