Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మఠంపల్లి
మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో విద్యార్థులకు తాగేందుకు ప్యూరీఫైడ్ వాటర్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు మంగళవారం మండల విద్యాధి కారి చత్రునాయక్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తాగేందుకు ప్యూరీఫైడ్ వాటర్ లేక,ఇంటి వద్ద నుండి పాఠశాలకు వచ్చే పిల్లలు ఇంటినుండి తెచ్చు కుంటున్నారని, కొందరు బయట కొనుక్కొని తాగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు.వినతిపత్రం అందజేసిన వారిలో పోతబత్తిని శ్రీనివాస్, ఎస్డి.రన్మియా, హుస్సేన్ ఉన్నారు.