Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి
వికాస్ రాజ్
నవతెలంగాణ-భువనగిరిరూరల్
ఫోటో సిమిలర్ ఎంట్రీ క్రింద తొలగించిన ఓట్ల వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం ఆయన రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి రవి కిరణ్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఫోటో సిమిలరీ ఎంట్రీ పరిశీలన, బూత్ స్థాయి అధికారుల నియామకం, ఆధార్ నమోదు తదితర అంశాలపై సమీక్షించారు. యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వివరిస్తూ జిల్లాలోని 561 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పూర్తిస్థాయిలో 561 మంది బూత్ లెవల్ అధికారులు ఉన్నారని తెలిపారు. మూడు నెలల నుండి వచ్చిన అభ్యంతరాలు, దరఖాస్తులను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఆధార్ నమోదు 94.43 శాతం పూర్తి అయినట్లు తెలిపారు. జిల్లాలలో 2020, 21, 22 సంవత్సరాలకు సంబంధించి ఫేస్-1 కింద 14,750 ఎపిక్ కార్డులు పోస్ట్ ఆఫీసుల ద్వారా పంపిణీ చేసినట్టు తెలిపారు.అక్టోబర్ 2022 నుండి జనవరి 2023 వరకు ఫేస్-2 కింద 13,386 ఎపిక్ కార్డులు ప్రింటింగ్ దశలో ఉన్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ గిరిధర్, డిప్యూటీ తహసీల్దార్ సురేష్ పాల్గొన్నారు.