Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టించుకోని గ్రామపంచాయతీ పాలకవర్గం
నవతెలంగాణ- వలిగొండ
మేజర్ గ్రామపంచాయతీ వలిగొండలో స్థానిక వెంచర్లో గ్రామ పంచాయతీకి సర్వేనెంబర్ 300 301 302 405 406 515లలో 5 ఎకరాల 27 గుంటలు భూమిలో వెంచర్ చేశారు అందులో గ్రామపంచాయతీకి 750 గజాలు వదిలిపెట్టారు సర్పంచికి షాడో గా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి కొంతమంది నాయకులు సహకారంతో ఆ వెంచర్లో స్థలాన్ని అక్రమంగా నలుగురు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు భూమిని రూ లక్షలు అమ్మి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని మార్చి 29న జరిగిన గ్రామసభలో పట్టణ సిపిఎం నాయకులు ఆ స్థలంపై విచారణ జరిపి బాధ్యులపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని స్థానిక సర్పంచిని పంచాయతీ కార్యదర్శిని డిమాండ్ చేసిన విషయం తెలిసింది. ఇదే విషయం ఒక స్థానిక పేపర్లో కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు బుధవారం పంచాయతీ కార్యదర్శి స్పందించి స్థానిక వెంచర్ స్థలాన్ని సందర్శించి ఆ వెంచర్ లో కడీలు నాటిన స్థలాన్ని పరిశీలించి గ్రామపంచాయతీకి వదిలే స్థలాన్ని విక్రయించడం గాని కొనుగోలు చేయడం గాని నేరమని బ్యానర్‌ను, డిమాండ్ నోటీసును వెంచర్లు కట్టడానికి వచ్చారు. వెంటనే షాడో వివరిస్తున్న ఒక వ్యక్తి ఫోన్ చేయగానే ఆ ఫ్లెక్సీ ని అక్కడే వదిలేసి సిబ్బందితో తిరిగి వెళ్లిపోయారు. ఈ విషయంపై సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ స్పందించి స్థలాన్ని గ్రామపంచాయతీ ఆధీనంలోకి తీసుకోకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై విక్రయించిన వారిపై చర్యలు తీసుకోకపోతే ఆ స్థలములో ఎర్రజెండాలు పాతి గ్రామపంచాయతీకి స్థలాన్ని అప్పగిస్తామని హెచ్చరించారు.