Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ఓటర్ జాబితా నుండి తొలగించిన ఓటర్ల వివరాలను మరోసారి పరిశీలన చేసి ధవీకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం ఆయన రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టీ.రవి కిరణ్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో ఫోటో సిమిలరీ ఎంట్రీ పరిశీలన, బూత్ స్థాయి అధికారుల నియామకం, ఆధార్ నమోదు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారికి జిల్లా కలెక్టర్ టీ.వినరు కృష్ణారెడ్డి సమాధానమిస్తూ మాట్లాడారు. జిల్లాలోని 1,747 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పూర్తిస్థాయిలో 1,747 బూత్ లెవల్ అధికారులు ఉన్నారని, బూత్ లెవెల్ అధికారులు, తహశీల్దార్ల ద్వారా ఓటర్ల జాబితాలో తొలగింపుకు గురైన ఓటర్లను పరిశీలించి అర్హులైన వారు వుంటే దవీకరణ చేసి ఓటర్‌గా నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఎస్డీసీ యూనిట్ 2 రోహిత్ సింగ్, ఆర్డీఓ జయ చంద్రరెడ్డి, ఎన్నికల డీటీ విజరు తదితరులు పాల్గొన్నారు.