Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిక్షా నాయక్ వర్థంతి సభలో జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
పేదల పక్షాన పోరాడేది ఒక ఎర్రజెండానేనని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రకాష్‌నగర్‌లో మూడవత్ బిక్షానాయక్ 44 వర్థంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా భిక్షా నాయక్ చిత్రపటానికి పూలమాలాలులేసి నివాళులర్పించారు. అనంతరం జూలకంటి మాట్లాడుతూ పేదలకు ఇండ్ల స్థలాలు ఇప్పించి వారు గుడిసెలు వేసుకొని జీవించే విధంగా ఎన్నో పోరాటాలు చేశారన్నారు. రిక్షా కార్మికుడిగా పనిచేస్తూనే కుటుంబం కంటే ప్రజాసేవకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవాడని ఆయన సేవలను కొనియాడారు. చింతపల్లి శివారులో పేదల గుడిసెలు తీసేస్తున్నారని సమాచారం అందడంతో దానిని అడ్డుకునేందుకు వెళ్లిన బిక్షానాయక్ను భూస్వామ్య గుండాలు హత్య చేశారని తెలిపారు. ఆయన చూపిన మార్గాన్ని ఎంచుకొని పేదల పక్షాన పోరాటాల నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం బలమైన పోరాటాలు చేసినప్పుడే అమరవీరులకు నివాళులు అర్పించినట్లు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, పెన్షన్ల సంఘం జిల్లా అధ్యక్షులు నూకల జగదీష్ చంద్ర, పట్టణ కార్యదర్శులు డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, భవాండ్ల పాండు, మండల కార్యదర్శి మూడవత్ రవినాయక్, జిల్లా నాయకులు పాదూరి శశిధర్‌రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, రేమిడాల పరుశురాములు, తిరుపతి రామ్మూర్తి గోవర్ధని, గాదె పద్మ, గుణగంటి రామచంద్ర, కోడిరెక్క మల్లయ్య, దేవయ్య, కుటుంబ సభ్యులు హామ్లి కుమారుడు మూడవత్ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.