Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధే తన లక్ష్యమని మున్సిపల్ చైర్మెన్‌్ వెన్‌రెడ్డి రాజు తెలిపారు. గురువారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని 17వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణ పనులకు మున్సిపల్ సీపీఐ(ఎం) ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలోని సమస్యలు అంచెలంచెలుగా పరిష్కరించి, అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మెన్ చింతల దామోదర్‌రెడ్డి, కౌన్సిలర్ బండమీది మల్లేశం, నాయకులు చింతల ప్రభాకర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, గుజ్జుల సురేందర్‌రెడ్డి, దేప రాజు, కాసుల లక్ష్మణ్‌గౌడ్, వెల్తూరి జంగయ్య, వేముల నర్సింహా, గుజ్జుల శ్రీనివాస్‌రెడ్డి, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.