Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూధాన్ పోచంపల్లి
రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని ఎన్పీఆర్డ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ అన్నారు. ఉపేందర్ గురువారంఆ సంఘం ఆధ్వర్యంలో పోచంపల్లి పురపాలక కేంద్రంలో టై డై ఫంక్షన్ హాల్ లో సిటీ ఉచిత బస్ పాసుల పంపిణీ సమావేశానికి అందే శేఖర్ అధ్యక్షత వహించారు. సమావేశంలో టై డైఅసోసియేషన్ అధ్యక్షులు తడక రమేష్ , ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించాలన్నారు. ధరల పెరుగుదలకు ఆనుగుణంగా వికలాంగుల పెన్షన్ రూ.10వేలు పింఛన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బస్పాస్ ఇన్చార్జి వెంకటేశం, బస్ భవన్ నుండి రవీందర్, లక్ష్మి నారాయణ మరియు మహిళ జిల్లా కన్వీనర్ కొత్త లలిత, మున్సిపాలిటీ అధ్యక్షులు దేవరాయ బిక్షపతి , కార్యదర్శి భరత్ లవ కుమార్, మధు మున్సిపాలిటీ కోశాధికారి ఆడపుసిద్దులు, మండల ఉపాధ్యక్షురాలు దోర్నాల పారిజాత ,తదితరులు పాల్గొన్నారు.