Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఉపాధ్యక్షులు రాములు
నవ తెలంగాణ-సూర్యాపేట
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడేది టీఎస్‌యూటీఎఫ్ అని రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ .రాములు అన్నారు. ఆ సంఘం10 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక సంఘ కార్యాలయం వద్ద జెండా విష్కరణ చేసి అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలపట్ల నిరంతరం పోరాడే సంఘం టి.యస్.యు.టి.ఎఫ్ అని అన్నారు.ఐక్య ఉద్యమాలకు నాయకత్వం వహించి అనేక పోరాటాలు చేసిందన్నారు. పదోన్నతులు, బదిలీలు నిర్వహించి విద్యా రంగాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలన్నారు. గురుకుల పాఠశాలల్లో ,కస్తూర్బా పాఠశాల ల్లో పని ఒత్తిడి తగ్గించాలని పేర్కొన్నారు.నూతన పెన్షన్ విధానాన్ని ,నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎన్.సోమయ్య,ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్,కోశాధికారి జి.వెంకటయ్య,రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు జె. యాకయ్య, జిల్లా కార్యదర్శులు ఎస్. కె.సయ్యద్,వీరారెడ్డి,ఎం.వెంకన్న,బి.పాపిరెడ్డి,వి. రమేశ్,బి.ఆడమ్,ఆడిట్ కమిటీ సభ్యులు పల్లె.అనిల్ కుమార్,చిలక. రమేష్, విఓటిటి కన్వీనర్ డి.లాలు,మహిళా కమిటీ కన్వీనర్ జె.క్రాంతి ప్రభ,సోషల్ మీడియా కన్వీనర్ డి. శ్రీని వాస్ చారీ,సాంస్కతిక కమిటీ కన్వీనర్ బి.ఆనంద్, అకడమిక్ సెల్ కన్వీనర్ ఆర్.శ్రీను మండలాల బాధ్యులు డి.బాలాజీ,బండ్ల.రమేష్,పి.కరుణాకర్ రెడ్డి, ఎన్.సై దా, యరగాని లింగయ్య పాల్గొన్నారు.