Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
మండల కేంద్రానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక డిపో మేనేజర్ కి వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించి ప్రజలు సుఖంగా ప్రయాణం చేయుటకు సదుపాయం కల్పిస్తున్నదని కానీ మండల ప్రజలు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలైన ఎంపీడీవో, తహసిల్దార్, పోలీస్ స్టేషన్, ఉపాధి హామీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సహకార పరపతి సంఘం, వెలుగు కార్యాలయం తో పాటు బ్యాంకుకు రావడానికి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మకూరుఎస్ గ్రామానికి చెందిన యువకులు పందిరి మాధవరెడ్డి, అబ్బగాని మధు, పందిరి రాంగోపాల్ రెడ్డి, జలగం సుమంత్, చిత్తలూరి మహేష్, రాచమల్ల మల్లేష్, గిలకత్తుల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.