Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్రిగూడ
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం మర్రిగూడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కాశిరెడ్డి కృష్ణారెడ్డి పాఠశాల ఆవరణలో టీఎస్ యూటీఎఫ్ సంఘ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు సంబంధించిన అనేక అంశాలలో పోరాటాలు ఎంచుకొని వాటి ద్వారా సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తున్న సంఘం యూటీఎఫ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షురాలు పరమేశ్వరి, మండల ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, కోశాధికారి బీ. యాదయ్య, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కే.బిక్షమయ్య, యూటీఎఫ్ సీనియర్ నాయకులు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కే. జనార్ధన్, జిల్లా ప్రతినిధి డి.సుందరయ్య, టీ.మంజుశ్రీ, వి. సుధారాణి, కే. శ్రీనయ్య, ఎస్కే. సులేమాన్, కే.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నకిరేకల్ : టీఎస్ యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం స్థానిక ఆ సంఘం ప్రాంతీయ కార్యాలయంలో ఉద్యమ పతాకాన్ని సీనియర్ నాయకులు సిహెచ్.రవీందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం పలువురు ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యాట మధుసూదన్‌రెడ్డి, నకిరేకల్ మండలశాఖ అధ్యక్షులు టీ.నర్సింహమూర్తి, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, శాలిగౌరారం అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ.రఫీ, ఎ.శంకర్, నాయకులు ఆర్.రాకేష్ కుమార్, పీ.తిరుమలయ్య, జీ.భద్రయ్య, చక్రపాణి, రవికుమార్, ఉపేందర్ రెడ్డి, జయసాగర్ పాల్గొన్నారు.
నాంపల్లి : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పదవ ఆవిర్భావ దినోత్సవాన్ని నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వాహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ మండల అధ్యక్షులు సిలువేరు నారాయణ పతాకావిష్కరణ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కొండమీది కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శి జంపాల అనిల్‌కుమార్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, యూటీఎఫ్ కార్యకర్తలు జ్ఞానేశ్వరి, శ్రీనివాస్, రాజు, విజయభాస్కర్, నరేష్, రఘుపతి, చంద్రమౌళి, రఘువర్ధన్, వెంకటేశ్వర్లు, రాజు తదతరులు పాల్గొన్నారు.