Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిరూరల్
భువనగిరిగి మండలం అనంతారం గ్రామంలో ఐదవ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక సర్పంచ్ చిందం మల్లికార్జున్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి ఆరోగ్యం అందరి శ్రేయస్సు అనే నినాదంతో ప్రస్తుతం వైద్య సేవలు అందుతున్నాయని, ప్రతి ఒక్కరూ జీవనశైలం మార్చుకుంటూ, దీర్ఘ కాలిక రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని కోరారు. అనంతరము సెంటర్ పరిధిలో ఎన్సీడీ క్లినిక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్లె దవాఖాన డాక్టర్ సాయిచంద్, సురేష్ కుమార్, రమాదేవి, ఉప సర్పంచ్ విట్టల్ వెంకటేష్, వార్డు సభ్యులు వేణు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.