Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
బాబా సాహెబ్ అంబేద్కర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డారని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారంఅంబేద్కర్ 132 జయంతి సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన జయంతి వేడుకలో ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. జిల్లా పరిషత్ వైస్‌చైర్మెన్ బికూ నాయక్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా అందరికీ ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు అనూరాధ, డాక్టర్ కె.నగేశ్, బీరు మల్లయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు రేణుక, లక్ష్మి, బలరాం, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వివిధ దళిత, వెనుకబడిన, మైనారిటీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు బటు రామచంద్రయ్య, నాగారం అంజయ్య, బండారు రవి వర్ధన్, బర్రె జహంగీర్, కల్లూరి మల్లేశం, డాక్టర్ ప్రమీల, కే.జయ, కొత్త నరసింహ, ప్రోత్నక్ ప్రమోద్ కుమార్, రావుల రాజు, కడారి వెంకటేష్ యాదవ్, ఈరపాక నరసింహా, పల్లెర్ల వెంకటేశం, భాస్కర నాయక్, చిలువేరు రమేష్, కృష్ణయ్య, శివశంకర్, బి.కృష్ణయ్య, సిద్ది రాములు, కడ్తాల శ్రీనివాస్, ఇటికాల దేవేందర్, అన్నె పట్ల కృష్ణ, కుతాడి సురేష్, దుబ్బ రామకృష్ణ, శివలింగం, పడగల ప్రదీప్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అమరేందర్ గౌడ్, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి జైపాల్ రెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భూక్యా నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి
అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం భువనగిరి పట్టణంలో వినాయక చౌరస్తా వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలే దేశానికి శ్రేయస్కరమని భావించటం వల్లే తెలంగాణ ప్రభుత్వం ఆ మహనీయుడికి 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిర్మించిందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ ఎనబోయిన ఆంజనేయులు, భువనగిరి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జెడ్పీటీసీ సూబ్బురు బీరు మల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, యాదగిరిగుట్ట జెడ్పిటిసి తోటకూర అనురాధ, పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, నాయకులు గుండెబోయిన సురేష్ యాదవ్, నాగపురి కృష్ణ పాల్గొన్నారు.
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో...
మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్ పూలమాలలు వేసి నివాలులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుబ్బురు బీరు మల్లయ్య, ఎంపీటీసీలు బొక్క కొండల్ రెడ్డి, రాంపల్లి కృష్ణ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, భువనగిరి ఎంపీడీవో గుత్తా నరేందర్ రెడ్డి, ఎంపిఓ అనురాధ దేవి, మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, నందనం సర్పంచ్ కడమంచి ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి సందెల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ 132వ జయంతిని శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించారు. పట్టణకేంద్రంలోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, సింగిల్‌విండో ఛైర్మన్లు వెన్‌రెడ్డి రాజు, చింతల దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు బండమీది మల్లేశం, ఎమ్‌డి.బాబాషరీఫ్, కోరగోని లింగస్వామి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతిని శుక్రవారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో సీపీఐ(ఎం) మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా, జిల్లాకమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, నాయకులు దండ అరుణ్‌కుమార్, ఎర్ర ఊషయ్య, గోశిక కరుణాకర్, దేప రాజు, మల్లేశ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతిని శుక్రవారం కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి టీపీసీసీ ప్రధానకార్యదర్శి చల్లమల్ల కృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ బ్లాక్, మండల, మున్సిపల్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, బోయ దేవేందర్, సుర్వి నర్సింహాగౌడ్, నాయకులు పాల్గొన్నారు.
ఆలేరు టౌన్ : మండల కేంద్రంలో శుక్రవారం బడుగు బలహీన బహుజన వర్గాల ఆశాజ్యోతి , భారత రాజ్యాంగ రూపకర్త డా. బాబా సాహెబ్ అంబెదర్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మాజీ శాసనసభ్యులు, జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ కుడుదుల నగేష్, ఆలేరు నియోజకవర్గ కాంటెస్ట్ ఎమ్మెల్యే కల్లూరి రామచంద్రారెడ్డి,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు.శ్రీ రామకృష్ణ విద్యాలయం కరస్పాండెంట్ బండిరాజుల శంకర్, సీపీఐ(ఎం) పట్టణ, మండల కార్యదర్శి లు ఎం ఏ. ఇక్బాల్ ధూపాటి వెంకటేష్ , మాజీ సింగిల్ విండో చైర్మన్ మొ రిగాడి చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి పౌల్, టీఎంకే జేయు జిల్లా కన్వీనర్ యేలగల కుమారస్వామి పటేల్, మున్నూరు కాపు సంఘం పట్టణ కార్యదర్శి యేలుగల అంజయ్య పటేల్ , యేలుగల పాపయ్య పటేల్, చిరుగా శ్రీనివాస్ పటేల్ , తోట బాలరాజు పటేల్,బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్టా మల్లేశం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త కృష్ణ,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అయిలీ సత్తయ్య , చెక్క వెంకటేష్,బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి మొరిగాడి శ్రీశైలం, మండల పార్టీ అధ్యక్షులు సంగి నవీన్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్, అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ సంఘము ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బొమ్మ కంటి బాలరాజు, చిరుగ రాంనర్సయ్య,పరిగెల రాములు, మాల మహానాడు జిల్లా నాయకులు తుంగ కుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు తాటికాయల నరేందర్, మధు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు గడ్డం నాగరాజు, జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి , ఆర్టిఏ మెంబెర్ పంతం కృష్ణ ,కౌన్సిలర్ బేతి రాములు ,మాజీ సర్పంచ్ చింతకింది మురళి , మాజీ ఇంచార్జి సర్పంచ్ దాసి సంతోష్ ,కొలుపుల హరినాద్ , కో ఆప్షన్ మెంబెర్ సీస రాజేష్ ,జల్లి నర్సింలు ,జూకంటి శంకర్ ,ప్రధాన కార్యదర్శి పత్తి వెంకటేష్, దిన శరణ్య స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతల సాయిబాబా, డాక్టర్ మురహరి వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆలేరు నియోజకవర్గం ఇన్చార్జి గర నరేష్, ప్రభుత్వ కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డీివైఎఫ్‌ఐ వివిధ పార్టీల సంఘాల నాయకులు మొరిగాడి రమేష్, బుగ్గ నవీన్, గణేష్, యాదగిరి, నాగరాజు,వడ్డేమాన్ బాలరాజు, భువనగిరి గణేష్, వడ్డేమాన్ విప్లవ్, కాసుల నరేష్, తోట మల్లయ్య, పత్తి రాములు, పత్తి సతీష్, పో రెడ్డి శ్రీనివాసు, కందుల యాదగిరి, రమేష్, యే లుగల వెంకటేష్,పగడాల శ్రీనివాస్,పత్తి ఆదర్శ్,తదితరులు పాల్గొన్నారు.
ఆలేరు రూరల్ : అణగారిన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేటి విద్యార్థి మేధావి సంపాదకుల సంఘ సంస్కర్త తత్వవేత్త రచయిత రాజనీతిజ్ఞుడు మానవ హక్కుల పరిరక్షకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మాజీ ఎమ్మెల్యే నగేష్ కాంటెస్ట్ ఎమ్మెల్యే కల్లూరి రామచంద్రారెడ్డి, ఎంపీపీ గంధ మల్ల అశోక్ అన్నారు శుక్రవారం మండల కేంద్రంతో పాటు కొలనుపాక కొల్లూరు తూర్పు గూడ శర్బనాపురం షారాజీపేట గ్రామాలలో అంబేద్కర్ 132 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా అంబేద్కర్ స్థూపాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు .ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి పౌలు, సర్పంచులు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, బండ పద్మ పర్వతాలు ,కోటగిరి జయమ్మ ,వంగాల శ్రీశైలం, బి.ఎస్.పి మండల అధ్యక్షులు సంగి నవీన్ కుమార్, వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి నరేష్, గడ్డం నాగరాజు, తుంగ కుమార్, తోడేటి నరేందర్ ,జంగా కమల, చాడ రాజు ,మిట్టపల్లి భాస్కర్ ,నేతగాని ఎల్లేష్, ఫీల్డ్ అసిస్టెంట్లు నరేందర్, శ్రీనివాస్ విజరు సందీప్ బాల్ నర్సయ్య,తదితరులు హాజరయ్యారు.
యాదగిరిగుట్ట : రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలు శుక్రవారం గుట్ట పట్టణంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బూడిద జానీ అధ్యక్షతన నిర్వహించారుఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా,జెడ్పెటీసీి తోటకూర అనురాధ,ఎంపీపీ చీర శ్రీశైలం,ఎమ్మార్పీఎస్ పోలిట్ భ్యూరో సభ్యులు మంద శంకర్,సీపీిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ,కాంగ్రెస్ ఇంచార్జ్ బీర్ల ఐలయ్య, సీపీఐ(ఎం)నాయకులు భీమగాని రాములు,బీజేపీ జిల్లా ఇన్చార్జి నందకుమార్ లు పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మిట్ట వెంకటయ్య గుండ్లపల్లి భరత్ ,ఎరుకల హేమెంధర్ కోఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య ,మాజీ ఎంపీటీసీ సిస కష్ణ బిజెపి సీనియర్ నాయకులు రచ్చ శ్రీనివాస్ ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు ఆకారం లక్ష్మినారాయణ,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బందారపు బిక్షపతి,బిజెపి మండల అధ్యక్షుడు కళ్లెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్ : యాదగిరిగుట్ట ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర శ్రీశైలం జడ్పిటిసి తోటకూర అనురాధ ఎంపీడీవో ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాళ్ల జనగాం గ్రామపంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ తెల్జూరి శ్రీశైలం వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వంగపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కానుగు కవిత బాలరాజ్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వలిగొండ : సిపిఎం వలిగొండ మండల కార్యాలయం వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సిర్పంగి స్వామి పూలమాలవేసి నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు దుబ్బ లింగం,ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి వేముల నాగరాజు, సిపిఎం నాయకులు కోరబోయిన కిరణ్,వెంకటగల్ల మహేష్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు .
సంస్థాన్ నారాయణపురం : అంబేద్కర్ ఆశయాలు సాధిస్తామని శపధం చేశారు. శుక్రవారం మండలంలోని నారాయణపురం,పుట్టపాక,సర్వేలు, జనగాం తదితర గ్రామాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.అంతకుముందు అంబేద్కర్ చిత్రపటాలు,విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.మండలంలోని పుట్టపాక గ్రామంలో సిపిఐ(ఎం)నాయకులు దొంతగోని పెద్దలు,పిట్ట రాములు,కేసిరెడ్డి యాదవ రెడ్డి, పంకర్ల యాదయ్య,గాజుల అంజయ్య, కొంగరి మారయ్య, జోకు రామచంద్రం, శంకరయ్య,మల్లారెడ్డి,శివ శంకరాచారి,నారాయణపురంలో సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు శికిల మెట్ల శ్రీహరి, స్థానిక ఎస్సై యోగేంద్ర, నాయకులు జి శ్రీనివాసచారి, ఉప్పల లింగస్వామి ఏపూరి సతీష్ మహేశ్వర స్వామి కట్ట గాలయ్య కొండమల్ల సతీష్ రహీమ్ షరీఫ్ నరసింహ దుబ్బాక భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.