Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శిఎండి.జహంగీర్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మహనీయుడు అంబేద్కర్ పుట్టిన రోజున పూలదండలు వేయటం, జై భీమ్ అని నినదించడం, డీజే లతో ఊరేగింపులు చేయడమే కాదు మనువాడం పై మహోద్యమమే అంబేడ్కర్ ఘనమైన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. శుక్రవారం ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఏప్రిల్ 14 రోజు డిసెంబర్ 6 రోజున ఆయన జయంతి వర్ధంతిల సందర్భంగా మాత్రమే అంబేద్కర్ ఆశయాలని స్మరించుకొని మిగిలిన 363 రోజులు ఆయన ఆశయాలకు భిన్నమైన కార్యాచరణలో నిమగం కావడం ఒక తంతుగా మారుతుందాని అన్నారు. ఈ సందర్భంగానైనా అసలు అంబేద్కర్ ఏం చెప్పారు.? మన పాలకులు ఏం ఆచరిస్తున్నారు?అంబేద్కర్ ఆశయాన్ని సాధించే వారసులెవరు? వారు ఏం చేయాలి? ఇప్పుడు అందరం నెమరవేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అంబేద్కర్ అనగానే కేవలం రాజ్యాంగం రాశాడు రిజర్వేషన్లు ఇచ్చాడనీ, ఆయన దళితుల దేవుడు అని ఆయన పట్ల భక్తి చాటుకోవడానికి చాలా మంది పోటీపడుతున్నారన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు పరమవిరోధిగా ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ కూడా పూలదండలు వేసి కొబ్బరికాయలు కొట్టడం తిలకం దిద్దడం వంటి వాటితో ఆర్ఎస్ఎస్ మేము వారసులం అంటున్నారన్నారు. అమెరికా కొలంబియా విశ్వవిద్యాలయం ఎదుట 300 అడుగుల స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. రష్యా దేశ అధ్యక్షుడు పుతిన్ తన ఛాంబర్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాడనీ, ఐక్యరాజ్యసమితిలో ప్రతి ఏటా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని, అంబేద్కర్ పుట్టిన రోజున ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందనారు. ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ కు కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయన్నారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళా సమానత్వం సాధించకుండా దేశం సమాన అభివృద్ధి సాధించలేమని, మహిళా సమానత్వం కోసం నాడు పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టగా, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించనందుకు కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారన్నారు. బ్రాహ్మణిజం క్యాపిటలిజం భారత దేశ ప్రజలకు శత్రువులని ప్రకటించారనీ గుర్తు చేశారు.లాభాలు వచ్చే పాడియావు లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా బడా కార్పొరేట్ శక్తులకి అమ్ముతున్నారు ఇప్పటికే 16 కీలక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, జిల్లా ఆఫీస్ కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్, సందెల రాజేష్, అన్నం పట్ల కృష్ణ పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం
భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక పోరాటాల విప్లవ వీరుడు, అసమానతలు లేని సమాజం కోసం అనునిత్యం పరితపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132 వ జయంతి స్ఫూర్తితో మనువాదుల,మతోన్మాదుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, సీఐటీయూ, రైతు సంఘం, యూటీఎఎఫ్,జిఎంపిఎస్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132 జయంతి సందర్భంగా పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు, సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దాసరి పాండు, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కృష్ణ , జిఎంపిఎస్ జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ముక్కెర్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.