Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అర్వపల్లి
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ మన్నెరేణుక లక్ష్మీనర్సయ్యయాదవ్, జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్ అన్నారు.శుక్రవారం సెల్ఫ్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.పర్సాయపల్లి ,జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి, బొల్లంపల్లి, కుంచమర్తి గ్రామాల్లో వారు ధాన్యంకొనుగోలుకేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు.ధాన్యాన్ని దళారీలకు విక్రయించి మోసపోవద్దన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలఅధ్యక్షులు గుండగాని సోమేష్‌గౌడ్ తహసీిల్దార్ పి.యాదగిరిరెడ్డి,ఏపీఎం మల్లేష్,వీసీలు సుధాకర్, పద్మావతి,గ్రామాల సర్పంచులు పుప్పాల శేఖర్, కుంభం ఉషారాణి, నాగరాజు,బైరబోయిన సునీత, రామలింగయ్య, ఉగ్గం ఉపేంద్ర లింగరాజు,దబేటి జ్యోతిరాణి, ఎంపీటీసీలు తనకు పద్మ శ్రీనివాస్, రాచకొండ గీతా సురేష్, బొడ్డు పద్మ రామలింగయ్య,మహిళా సంఘాల అధ్యక్షులు, సభ్యులు, రైతులు, హమాలీ కార్మికులు పాల్గొన్నారు.
అదేవిధంగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మెన్ కుంట్ల సురేందర్ రెడ్డి అన్నారు.మండలంలోని కొమ్మాల, రామన్నగూడెం గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు ఎంపీపీ మన్న రేణుక లక్ష్మీనర్సయ్యయాదవ్, పీఏసీఎస్ చైర్మెన్ చేతులమీదుగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రామన్నగూడెం సర్పంచ్ పీరమ్మ సీఈవో రామస్వామి, ఏఈఓ శోభారాణి పాల్గొన్నారు.
నూతనకల్ : రైతులు ధాన్యం కొనుగోలుకేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, జెడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి కోరారు.మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలుకేంద్రాలను వారు ప్రారంభించి మాట్లాడారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తీగల కరుణశ్రీ గిరిధర్‌రెడ్డి,ఎంపీటీసీ పన్నాల రమా మల్లారెడ్డి,సర్పంచ్ చూడి లింగారెడ్డి,కొంపెల్లి రాంరెడ్డి,బాణాల సత్యనారాయణరెడ్డి,తహసీల్దార్ జమీరుద్దీన్, ఎంపీడీవో ఇందిరా, ఏపీఎం కర్నాకర్, ఏపీఓ శ్రీరాములు, మండల వ్యవసాయ అధికారి మురళిబాబు, వ్యవసాయ విస్తరణ అధికారి జానయ్య, తాడూరి లింగయ్య, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, పాల్గొన్నారు.
పెన్‌పహాడ్ : రైతులు దళారులతో మోసపోకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని ఎంపీపీ నెమ్మాది భిక్షం అన్నారు.మండల పరిధిలోని మాచారం గ్రామంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.అంతకుముందు కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొల్లక సైదమ్మబొబ్బయ్య, ఎంపీటీసీ నాగునాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొంగరియుగంధర్, కోఆప్షన్‌సభ్యులు షేక్ రఫీ, ఏపీఎం అజరుకుమార్, ఏవో కృష్ణసందీప్, ఏఈఓ కారింగుల గోపి, సీసీలు చెన్నయ్య, సైదులు, మహిళ సమైక్య మండల అధ్యక్షురాలు మంజుల, కార్యదర్శి నాగమ్మ, విబికేలు సరిత, జయమ్మ, కోశాధికారి స్వరూప, నాయకులు చిత్తరంజన్, నరేందర్, గంగారపు శ్రీను పాల్గొన్నారు.
కోదాడరూరల్ : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మెన్ ఆవుల రామారావు కోరారు.కోదాడ పీఎసీఎస్ పరిధిలోని తొగర్రాయి, గణపవరం, కొమరబండ గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ వైస్‌చైర్మెన్ బుడిగం నరేష్, డైరెక్టర్లు కమతంవెంకటయ్య, ప్రభాకర్‌రావు, బాబు, సీతారాములు, మాజీసర్పంచ్ సంపేటరవి, సులోచనరావు, పసుపులేటి రామారావు గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
నాగారం: రైౖతును రాజును చేయడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జాజిరెడ్డిగూడెం పీఏసీఎస్ చైర్మెన్ కుంట్ల సురేందర్‌రెడ్డి అన్నారు.మండలపరిధిలోని వర్ధమానుకోట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలుకేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోయిని శోభా లింగమల్లు, పీఏసీఎస్ వైస్‌చైర్మెన్ ఇంద్రసేనారెడ్డి, సీఈఓ రామస్వామి, డైరెక్టర్లు సోమలింగం, శ్రీను,సుందరనజీర్,నాయకులు బండగొర్ల ఎల్లయ్య, ఈరేటి అంజి, సిబ్బంది సైదులు, సోమయ్య,రైతులు సొంమల్లు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరుఎస్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలుకేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మెన్ కొణతం సత్యనారాయణరెడ్డి కోరారు.మండలపరిధిలోని ఏపూరులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్ప, ఏపీఎం మంజుల, ఆర్ఐ అంజయ్య, సర్పంచ్ సానబోయిన రజితసుధాకర్, ఎంపీటీసీ దామిడి మంజుల శ్రీనివాస్, ఉపసర్పంచ్ అవిరే పద్మఅప్పయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.