Authorization
Sun March 02, 2025 07:46:14 am
నవతెలంగాణ-చివ్వెంల
సూర్యాపేట జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సీపీఐ(ఎంఎల్)ప్రజాపంథా ఆధ్వర్యంలో ప్రజాపోరు యాత్రను చివ్వెంల నుండి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పాల్గొని మాట్లాడారు.అంబేద్కర్ సామాజికస్ఫూర్తితో జార్జిరెడ్డి విప్లవచైతన్యంతో ప్రజలు ప్రజాపోరుయాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.తెలంగాణ వస్తే ప్రజాసమస్యల పరిష్కారమై ప్రజలంతా ఆనందంగా ఉంటారని ఆశిస్తే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.సూర్యాపేట నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, అధికారుల లంచగొండితనం విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపించారు.వీటిని అంతం చేయాలంటే విప్లవ పార్టీలకే సాధ్యమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాపంథా రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు,జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, పీఓడబ్ల్యు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్రఅఖిల్, జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మన్న, గొడ్డలి నర్సన్న, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి రాంజీ,పీఓడబ్య్లూ సహాయ కార్యదర్శి సూరంరేణుక, దుర్గన్న, జీవన్, పద్మ, సునీల్, పీడీ ఎస్యూ నాయకులు పుల్లూరి సింహాద్రి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.