Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కరించడంలో పాలకవర్గం అధికారులు విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎల్లావుల రాములు, సీనియర్ నాయకులు ఎం.వెంకటేశ్వర్లు విమర్శించారు.శనివారం ఇంటింటికి ప్రచారంలో భాగంగా మటన్ మార్కెట్, పొట్టి శ్రీరాములసెంటర్, గాంధీపార్క్ ప్రాంతాలలో ప్రచార నిర్వహించి అక్కడి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా పాత బస్టాండ్లో ప్రయాణికులకు నిలువనీడ లేదని, మిషన్ భగీరథ ట్యాంక్లు, నల్లా కనెక్షన్లు కేవలం అలంకారప్రాయంగానే మిగిలాయని నీరు మాత్రం రావడం లేదని విమర్శించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు, కంబాల శ్రీనివాస్,దేవరం మల్లేశ్వరి, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, రమేష్, కొప్పోజు సూర్యనారాయణ ,జడవెంకన్న, సోమగాని కృష్ణ, పి.వాసుదేవరావు, రమేష్,జక్కుల శ్రీను, సుందరి, పద్మ, సత్యవతి, గోపబోయిన వెంకటేశ్వర్లు, సుశీల తదితరులు పాల్గొన్నారు.