Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ కోటాచలం
నవతెలంగాణ-అర్వపల్లి
ఉపాధి హామీ కూలీలకు,ఐకేపీ సెంటర్లలో హామాలీలకు, రైతులకు తప్పకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేయాలని డీఎంహెచ్ఓ కోటాచలం ఆదేశించారు.శనివారం ఆయన మండలంలోని జాజిరెడ్డిగూడెం ఉప ఆరోగ్య సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఆరోగ్య సెంటర్లో గల మందులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన వైద్య, ఆరోగ్య సిబ్బందితో మాట్లాడుతూ డూస్ ఉన్న చిన్నపిల్లలకు టీకాలు అందజేయాలని,గర్భిణులంతా ప్రభుత్వాస్పత్రుల్లో డెలివరీ అయ్యేలా అవగాహన కల్పించా లన్నారు. వైద్య సేవలను అందించాల న్నారు.ప్రభుత్వం ఆదేశానుసారం జిల్లాలో 122 పల్లెదవాఖానలు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశామన్నారు .వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు.ఈ కార్యక్రమంలో సైదమ్మ, ఎంపీహెచ్ఓ శకుంతల, ఆశాలు పాల్గొన్నారు.