Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
ఈ నెల 18న చౌటుప్పల్ పట్టణంలో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్, మండల అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, గిరికటి నిరంజన్‌గౌడ్ కోరారు. శనివారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల, మున్సిపాలిటీ, గ్రామశాఖలు, వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గ్రామాల నుండి ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్, సింగిల్‌విండో ఛైర్మన్లు వెన్‌రెడ్డి రాజు, చింతల దామోదర్‌రెడ్డి, మార్కెట్ మాజీ ఛైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ ఉడుగు మల్లేశ్‌గౌడ్, బీఆర్టీయు జిల్లా అధ్యక్షులు ఢిల్లీ మాధవరెడ్డి, నాయకులు చిన్నం బాలరాజు, అల్మాసిపేట కృష్ణ, బొంగు జంగయ్యగౌడ్, గుండెబోయిన వెంకటేశ్‌యాదవ్, జాల మల్లేశ్‌యాదవ్, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, బొడిగె ఆనంద్‌గౌడ్, బాలకృష్ణ, సుర్కంటి శ్రీధర్‌రెడ్డి, తడక కిరణ్, దొడ్డ లింగస్వామి, ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు.