Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్రెడ్డి
నవతెలంగాణ -తుర్కపల్లి
తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఒక బీఆర్ఎస్కే ఉందని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్, గొంగడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జయం ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం మండల కేంద్రం నుండి ఫంక్షన్ హాల్ వరకు భారీ ఎత్తున ర్యాలీతో సమావేశానికి కార్యకర్తలు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని సంక్షేమ పథకాలు ఒక తెలంగాణలోనే ఉన్నాయన్నారు. 9 ఏండ్లల్లో మండలంలో వర్షాకాలంలో 1688ఎకరాలు పంట పండితే ఇప్పుడు 16 వేల ఎకరాల పంట పడుతుందన్నారు. ములకలపల్లి నుండి ధర్మారం వరకు రోడ్డును కోసం మూడు కోట్ల 37 లక్షల 50 వేలు మంజూరు చేసినట్టు తెలిపారు. తెచ్చింది తామే ఇచ్చింది తామేనని మాటలు చెప్పుకునే కాంగ్రెస్ వాళ్లకు తగిన గుణపాఠం తప్పదన్నారు. బీజేపీ ప్రభుత్వంలో గ్యాస్ ధర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని ప్రజలు ఈ విషయాన్ని గ్రహిస్తున్నారన్నారు. బీఆర్ఎస్కు 100 సీట్లు రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, డిసిసిబి చైర్మన్ బొంగిడి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మెన్్ గడ్డమీద రవీందర్ గౌడ్, ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్, పిఎసిఎస్ చైర్మన్ నరసింహారెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ కమ్మిరి శెట్టి నర్సింలు, ఎంపీటీసీలు పలుగుల నవీన్ కుమార్, గిద్దె కరుణాకర్, కోమటిరెడ్డి సంతోష, సర్పంచులు పోగుల ఆంజనేయులు, నాంసాని సత్యనారాయణ ,ఇమ్మడి మల్లప్ప, అమలా బాలకృష్ణ, సురేష్ ,కల్లూరి ప్రభాకర్ రెడ్డి, డొంకెని మల్లేష్, కో ఆప్షన్ రహమత్ ,ఎఎంసి డైరెక్టర్లు బద్దు నాయక్ ,పత్తిపాటి మంజుల, మాజీ ఎంపీపీ బో రెడ్డి రామిరెడ్డి పాల్గొన్నారు.