Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వలిగొండ
గ్రామపంచాయతీకి సంబంధించిన స్థిర, చర ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత గ్రామ సర్పంచి దేనని ఆ బాధ్యత మరిచి సర్పంచ్ తనకు సంబంధం లేదనే మాట అనడం సమంజసంగా లేదని సీపీఐ(ఎం) పట్టణ కమిటీ సభ్యులు అన్నారు. శనివారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూర శ్రీనివాస్ మాట్లాడుతూ వాటర్ ప్లాంట్ వెనక గల వెంచర్లో గ్రామపంచాయతీకి వదిలిన స్థలం 1104గజాలలో ఒకచోట 549 మరొకచోట 223, 175, 80.ఖాళీ స్థలాలు 2016 నుండి 2018 వరకు ఖాళీ స్థలం ఖాళీ స్థలంగానే ఉందన్నారు. ప్రస్తుత సర్పంచ్ పదవీ ప్రమాణ స్వీకారం చేశాక 10 నెలల కాలానికే ఆ వెంచర్లో 2019 డిసెంబర్ నెలలోనే వెంచర్ యజమాని ఖాళీ స్థలం అమ్మడం మొదలు పెట్టినట్లు తెలిపారు. సంబంధిత విషయాన్ని స్థానిక సర్పంచ్ తెలుసుకొని 2021 సంవత్సరంలోనే అప్పటి పంచాయతీ కార్యదర్శి, క్లర్కు, సిబ్బంది డోజర్ సహాయంతో సర్పంచ్ ఆదేశాలతో రిజిస్ట్రేషన్ చేసిన స్థలాన్ని చదును చేసిన విషయం సర్పంచ్ కి తెలవదా అని ప్రశ్నించారు. చదును చేసిన స్థలానికి ఫొటోతో సహా దిన పత్రికలలో ప్రచురణ చేయించడం నిజం కాదా అని అడిగారు. ఆ సమయంలోనే సంబంధిత వెంచర్ యజమానిని పిలిపించి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ రెండేండ్ల ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. 2018 కి ముందు జరిగిన సంఘటనలు తనకు సంబంధం లేదని పత్రిక ముఖంగా చెప్పడం ప్రజల సమస్యలు పట్టించుకోకపోగా తప్పించుకోవడమే అన్నారు. పార్టీలు, ప్రజలు, పత్రికలు చేసిన ఆరోపణలు నిజ నిజాలు సమీక్ష చేసి ప్రజలకు న్యాయం చేయాలి తప్ప సంబంధం లేదు అనడం ఎంతవరకు సమంజసమో చెప్పాలన్నారు. ఇప్పటికైనా ఖాళీ స్థలం గ్రామ పంచాయతీకి అప్పచెప్పి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.