Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల రమణ
నవతెలంగాణ - నల్లగొండ
బీఆర్ఎస్ మునుగోడు ఎన్నికల సందర్భంగా గౌడ ఆత్మీయ సమ్మేళనంలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కొనసాగిస్తామని చలో ప్రగతి భవన్ కార్యక్రమం చేపడతామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి.రమణ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో పానగల్లులో కల్లుగీత కార్మిక సంఘం నల్గొండ జిల్లా సమావేశం కొండ వెంకన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా యాదగిరిగుట్టలో వేలాదిమంది గీత కార్మికులతో జరిగిన బహిరంగ సభలో 25 తీర్మానాలు చేసి ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశామన్నారు. ఆ తర్వాత మునుగోడు ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడుతూ మేము పెట్టిన కొన్ని డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ద్విచక్ర వాహనాలు ఇస్తామన్నారు. గీతన్న బందు, గీతన్న బీమా, 10 రోజులలో ఎక్సీ గ్రేషియా, సొసైటీలకు లిక్కర్ షాపులు ఇస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధం కావాలని గీత కార్మికులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని గీత కార్మికులందరికీ ఉపాధి కలిగే చర్యలు చేపట్టాలని వృత్తిలో ప్రమాదాలు జరగకుండా మరణాలు సంభవించకుండా చూడాలని కోరారు. అందుకు ఆధునిక పరికరాలు ఇవ్వాలని మారుతున్న పరిస్థితుల కనుగుణంగా వృత్తిలో మార్పులు తీసుకురావాలని అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల భూములకు ధరలు విపరీతంగా పెరగడంతో భూ యజమానులు తాటి ఈత చెట్లు తొలగిస్తున్నారని అన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు ఉపాధి కలగాలంటే శాశ్వత పరిష్కారం చెట్ల పెంపకానికి భూమి, కల్లుకు మార్కెట్ కల్పించడం, నీరా ,తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పడమే మార్గమన్నారు. వృత్తిలో ప్రమాదం జరిగి చనిపోయిన వారి కుటుంబాలకు వికలాంగులకు ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషియా రెండు సంవత్సరాలైనా రాలేదని వారికి సంబంధించి 10 కోట్ల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వి వెంకట నర్సయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2023- 24 బడ్జెట్లో కేటాయించిన డబ్బులు విడుదల చేసి తాడి కార్పొరేషన్ కు ఇవ్వాలని తద్వారా సేఫ్టీ మోకులు ద్విచక్ర వాహనాలు తదితర సంక్షేమ పథకాలు అమలు చేయాలని అన్నారు. గీత కార్మికుల పెన్షన్ 5వేలకు ఎక్స్గ్రేషియా 10 లక్షలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గౌడ యువతి యువకులకు ఉపాధి కలిగించేందుకు తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు పెట్టాలన్నారు.నల్గొండ జిల్లా కార్యదర్శి చౌగానీ సీతారాములు మాట్లాడుతూ జిల్లాలో గీత వృతి చేసే వాళ్ళందరికీ సభ్యత్వం, గుర్తింపు కార్డులు, ఇవ్వాలని కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడిన వారికి కోరిన చోట సొసైటీలకు అవకాశం కల్పించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పానుగుల్ల అచ్చాలు, రాష్ట్ర కమిటీ సభ్యులు వేములకొండ పుల్లయ్య, రాచకొండ వెంకట్, చేతి వృత్తిదారుల జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్, కల్లుగీత కార్మిక సంఘం నల్గొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ భూపతి శ్రీనివాస్, కెేవీపీిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీందర్, కొప్పుల అంజయ్య, కార్యదర్శి పొడిసేటి వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.