Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొంతకాలంగా స్థలంపై సాగుతున్న పంచాయితీ
- ఇద్దరికిగాయాలు,పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
- గ్రామ సర్పంచ్ దాడి చేశారని బాధితుల ఆరోపణ
చౌటుప్పల్ రూరల్: మండలంలోని తుఫ్రాన్‌పేట గ్రామంలో కొంతకాలంగా భూ తగాదాలు నడుస్తున్నాయి.ఈ క్రమంలో గ్రామంలోని సర్వే నెంబర్ 29లో గ్రీన్స్టార్ వెంచర్ చేశారు.ఈ వెంచర్లో గ్రామపంచాయతీ సామాజికావసరాలకు వదిలిన భూమిని వెంచర్ యజమాని 800గజాలు తూప్రాన్‌పేట గ్రామానికి చెందిన గంధం రాజు అనే వ్యక్తికి అమ్మారు.దీనిపై అప్పట్లోనే గ్రామంలో ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమైంది.దీనితో గంధం రాజు ఓ కులసంఘానికి ఆ స్థలాన్ని ఇస్తున్నట్లు అప్పట్లో చెప్పడం జరిగిందని గ్రామస్తుల చెప్పారు.2017నుండి ఇప్పటి వరకు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు కులసంఘం వారు చేయకపోవడంతో గంధం రాజు తిరిగి స్వాధీనం చేసుకొని,తన బామ్మర్ది తుప్ప భరత్‌కుమార్ పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు.తన భూమి అంటూ అందులో నిర్మాణం చేయడానికి భరత్‌కుమార్ రావడంతో కులపెద్దలు అడ్డగించారని చెప్తున్నారు.ఇదిలా ఉంటే గ్రామ సర్పంచ్ చక్రం జంగయ్య ఆ స్థలంలో ప్రహరీ నిర్మించాలని కూలీలను పంపించాడు.ఇది తెలుసుకున్న గంధం రాజు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు వెళ్లే లోపే చక్రం జంగయ్య 20 మందిని తీసుకొని తన ఇంటి మీదకు వచ్చి దాడి చేసి చంపుతామని బెదిరించి విచక్షణారహితంగా కొట్టారని గంధం రాజు, భరత్‌కుమార్‌లు చెప్తున్నారు.
దాడిలో ఇద్దరికి గాయాలు,పోలీసులకు ఫిర్యాదు
తుప్రాన్‌పేట గ్రామంలో జరిగిన ఘర్షణలో గంధం రాజు, భరత్‌కుమార్ గాయపడ్డారు.చౌటుప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సర్పంచ్ చక్రం జంగయ్య,చక్రం రవీందర్, గంధం సతీష్, వర్కూరిరాము, వర్కూరి రాజు,గంధం ఆంజనేయులు, పరిదం సురేష్,పగడాల యాదయ్య, పాండులతో పాటు మరి కొంతమంది ఇంటి మీదకు వచ్చి దాడి చేసి గాయపరిచారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు.