Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తానని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు.ఆదివారం మున్సిపాలిటీ పారిశుధ్య నిర్వహణలో భాగంగా కొనుగోలు చేసిన రెండు స్వచ్ఛ ఆటోలను నీటి సరఫరా కోసం రెండు వాటర్‌ట్యాంకులను ఆమె ప్రారంభించి మాట్లాడారు.యాదాద్రి దేవస్థానాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామని, పట్టణాన్ని కూడా అదే రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలో రూపొందించామన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ ఎరుకల సుధా హేమేందర్‌గౌడ్ ,వైస్‌చైర్మెన్ మేడబోయిన కాటంరాజు, కౌన్సిలర్లు బూడిద సురేందర్,సీస విజయలక్ష్మీ కృష్ణగౌడ్, మాలోతు సరోజాహరీష్, దండబోయిన అనిల్, కోఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య,ఎస్డి.బాబా,ఎండి రిజ్వాన, కమిషనర్ టి. చక్రపాణి, మేనేజర్ కె.నరేష్‌రెడ్డి, శానిటరి ఇన్స్పెక్టర్ కిరణ్‌బాబు, ఎన్.ఇస్తారి, తదితరులు పాల్గొన్నారు.