Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
రాష్ట్రంలో నేడు విద్య అనేది ఒక్క వ్యాపారంగా మారిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, ఇటీవల జరిగిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, ఈనెల 18న ఇందిరాపార్క్‌లో జరిగే మహాదర్నను జయప్రదం చేయాలని భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్ కోరారు. ఆదివారం భువనగిరిలో పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఎస్పీటీఎస్సీ పేపరు లీకేజీలో ప్రభుత్వ పెద్దలహస్తం ఉందనే అనుమానం వ్యక్తం అవుతోందన్నారు.పేపర్ లీకేజీ చేసి ఎంతో నిరుద్యోగుల జీవితాలను ఆగం చేసిన వారిని వదిలి పెట్టొద్దన్నారు.రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.లక్షలాది మంది నిరుద్యోగ యువత రొడ్లమీదకు వచ్చి అరుస్తుంటే కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్‌హౌస్‌కు పరిమితమ య్యారని మండిపడ్డారు.పేపర్ లీకేజీ చిన్న విషయం అన్నట్టు వ్యవహరిస్తూ లీకేజీకి కారణమైన వారిని పక్కన పెట్టడం సరికాదన్నారు.లీకేజీ కేసులో టీఎస్పీటీఎస్సీ చైర్మెన్ జనార్దన్‌రెడ్డి,బోర్డు కార్యదర్శి అనితారామచంద్రన్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దేశపాక శ్రీనివాస్, బండారు రవివర్ధన్, బట్టురామచంద్రయ్యా, బేజాడికుమార్,గడ్డం నాగరాజు, వెంకటేశం,మందాల బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు.