Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
భానుడి భగభగతో పట్ట పగలు వాతావరణమంతా ఆలేరు పట్టణంలో నిప్పుల కొలిపిగా మారింది.ఉదయం సూర్యోదయం మొదలుకొని 9 గంటల వరకు కాస్త చల్లగా వాతావరణం చల్లచల్లగానే ఉంటుంది.10 గంటలు దాటిందంటే చాలు ఎండలు బగ్గున విజృంభిస్తున్నాయి. ప్రజలు రోడ్లపైకి రావడానికి జంకుతున్నారు.దూర ప్రయాణాలు చేసేవారు పెరిగిన తీవ్రమైన ఎండల కారణంగా ప్రయాణాలు సైతం వాయిదా వేసు కుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏ మండలం, ఏ గ్రామం చూసినా జిల్లావ్యాప్తంగా ఎండలు మండుతూ ఇదే పరిస్థితి నెలకొంది.మార్చి నెలలో అడపాదడపా పలుదఫాలు వర్షం పడడం కారణం కావొచ్చు. ఎండల ప్రభావం అంతగా కనబడనప్పటికీ, ఏప్రిల్ మాసం మొదలుకొని మాసం మధ్యలోకి వచ్చేసరికి సూర్య భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల తీవ్రతతో ప్రజలు బేంబెలిత్తిపోతున్నారు.ఉక్కపోత కారణంగా దాబాలలో వేడిని తాళలేక చెట్ల కింద సేదతీరుతున్నారు.ఆలేరు పట్టణంలోని మెయిన్‌రోడ్డంతా నిర్మానుష్యంగా మారింది. దుకాణసముదాయాలు తీర్చుకొని ఉన్నప్పటికీ, మెయిన్‌రోడ్డుపై బంద్వాతావరణం నెలకొంది.రానున్న రెండు నెలల పాటు జూన్, జూలై మాసాలలో ఎండలు పెరిగి పరిస్థితి మరింత క్లిష్టంగా మారనుందని వాతావరణ విశ్లేషకులు చెబుతున్నారు. ఎండల తీవ్రత కారణంగా వ్యవసాయ పనులు రైతులు ఉదయాన్నే ముగించుకుంటున్నారు.తిరిగి సాయంత్ర వేళలో ఎండ చల్లబడ్డాక వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే పరిస్థితి నెలకొంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు 40 నుండి 41 డిగ్రీల వరకు జిల్లాలో గరిష్టంగా నమోదవుతున్నాయి.కనిష్టంగా 22 ,24 నమోదవుతున్నాయి.తీవ్రమైన ఎండల కారణంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణికులు, ప్రయాణించేందుకు జంకుతున్నారు. ఆర్టీసీ బస్సు బాడీ ఐరన్‌తో చేయడం కారణంగా ఎండవేడిమి ఐరన్ వేడి రెట్టింపుపై ప్రయాణి కులకు ప్రయాణం చేయడం కష్టంగా మారింది. పట్టణ ప్రజలు, ప్రయాణికులు, వాహనచోదకులు ఎండతాపం తాళలేక కొబ్బరి బోండాలు, పళ్ళ రసాలు, చెరుకు, రాగుల జావా, పచ్చ జొన్న, మొక్కజొన్నలతో చేసే ఘటక, వాటర్ మిలన్, పుచ్చ పాండ్లు, ద్రాక్ష, కార్బోజ, చల్లని శీతల పానీయాలు తీసుకొని ఉపశమనం పొందుతున్నారు. ఆస్పత్రుల్లో మంచం పడుతున్నారు. ఎండదెబ్బ తగిలి ఇటీవల కాలంలో సంఖ్యలో రోజు వారీగా ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందు తున్నారు.పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా శుభకార్యాలు సైతం వాయిదా వేసుకుంటున్నారు. రాత్రి వేళల్లోనే పుట్టినరోజు వేడుకలు, ఇతర పండుగల వేడుకలు చేసుకోవడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
పెరిగిన ఏసీలు, కూలర్ల వినియోగం
పట్టణంలోని ఇళ్లల్లో కూలర్లు, ఫ్రీజ్‌లు, ఏసీల వినియోగం పెరిగింది. దీంతో విద్యుత్ వినియోగం పెరిగింది. సాధారణ ఫ్యాన్లు ఉన్నప్పుడు 250 రూపాయల నుండి 300 రూపాయలు వచ్చే విద్యుత్ బిల్లు, విద్యుత్ వినియోగం పెరగడంతో వెయ్యి రూపాయల నుండి రూ.3వేల వరకు కెపాసిటి విద్యుత్ యూనిట్లు వినియోగం బట్టి బిల్లు వస్తుందని వినియోగ దారులు చెబుతున్నారు. నాణ్యమైన కూలర్లను రూ.6 వేల నుండి రూ.15 వేల వరకు దుకాణదారులు విక్రయిస్తున్నారు. ఏసీ కూలర్ షాపుల ముందు రద్దీ కనబడుతుంది.
ఎండల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి
డాక్టర్ ప్రభాకర్
పెరిగిన తీవ్రమైన ఎండల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. తప్పనిసరి పరిస్థితులలో ప్రయాణించాల్సి ఉంటే తేలికపాటి వస్త్రాలు , తలపై టవల్ గోపి ధరించాలి. అలసట అనిపిస్తే శరీరాన్ని చల్లటి వస్త్రంతో తుడవాలి.మారుతాడి ఆరకుండా పలుమార్లు మంచినీరు సేవించాలి. నిమ్మరసం, మజ్జిగ , ఓ ఆర్ ఎస్ ప్రతి ఒక్కరు వేసవికాలంలో విధిగా సేవించాలి. పండ్లరసాలు తాగడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఏప్రిల్ 15 రోజులు, జూన్, జూలై ఎండ వేడిమి నుండి అప్రమత్తంగా ఉండాలి.