Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశంలో జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మార్క్సిజమే మానవాళికి శ్రేయస్సుకారమని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం సీపీఐ(ఎం) మిర్యాలగూడ మండల కమిటీ సమావేశం మిర్యాలగూడ మండలంలోని తుంగపాడు గ్రామంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలో అన్ని మార్గాల కంటే మార్క్సిజమే ఉన్నతమైన మార్గమని, అక్కడ శ్రమ దోపిడీ లేనటువంటి సమ సమాజ స్థాపన జరుగుతుందన్నారు. ఇక్కడ పేదరికం కానీ, వివక్షత కానీ చోటు లేనటువంటి మహోన్నతమైన వ్యవస్థ మార్క్సిజమన్నారు. అటువంటి మార్క్సిజం సాధన కోసం ప్రత్యేక పార్టీ సభ్యుడు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ మనుషుల్ని కులాలుగా, మతాలుగా విడగొట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజ్యాంగ స్థానంలో మనువాదాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నదని, ఈ కుట్రలను తిప్పి కొట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు . ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం ప్రయివేటీకరణ చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరిచే దుర్మార్గమైనటువంటి విధానాన్ని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, సీనియర్ నాయకులు పగిరోజు రామ్మూర్తి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు పిల్లుట్ల సైదులు, కందుకూరి రమేష్, గోవిందరెడ్డి, సైదమ్మ, శ్రీనివాస్ రెడ్డి, పొదిళ్ల శీను, బాబు నాయక్, పేలపోలు శ్రీనివాస్, కన్నె కంటి రామకృష్ణ, వెంకన్న, మట్టపల్లి వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, మంగ, తదితరులు పాల్గొన్నారు.
యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలి
నిడమనూరు:అన్ని గ్రామాలలో ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం నిడమనూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఆయన రైతులతో మాట్లాడారు. రైతులు గత 18 రోజులుగా ధాన్యాన్ని తీసుకొచ్చి కల్లాల్లో ఆరబెట్టుకున్నారని, ధాన్యం పూర్తిగా ఎండకు ఎండిపోయి తూకం తగ్గిపోతున్నాయని తెలిపారు. ఇంకా అనేక చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, వెంటనే ఏర్పాటు చేయాలని, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా సెంటర్కు వచ్చిన ధాన్యాన్ని వెంటనే వేగంగా తూకాలు వేసి మిల్లులకు తరలించాలన్నారు. కాంటాలు అయిన వెంటనే రైతులకు ధాన్యం పట్టిలు ఇవ్వాలని, గన్ని బ్యాగులు, తర్పన్ పట్టాలు రైతులకు సరిపోను అందుబాటులో ఉంచాలని, రాత్రి వేళలో ధాన్యానికి రక్షణగా లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. తూకలలో రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని, చివరిగింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఆరు కాలం కష్టపడి పండించిన రైతు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదని దేశానికి తిండి పెట్టే రైతును ప్రభుత్వం కాపాడుకోవాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మార్కెట్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం వల్ల గ్రామాలలో దళారులు పెరిగిపోయారని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని, ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించినా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి పూర్తిగా ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఆదుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ నల్ల చట్టాల వల్ల మద్దతు ధర మార్కెట్ వ్యవస్థ లేకుండా పోయి కార్పొరేట్ దళారి వ్యవస్థ తీవ్రంగా పెరిగి రైతు దివాలా తీసే ప్రమాదం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొనే రైతు వ్యతిరేక విధానాలను రైతులు సంఘటితంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ , మండల కమిటీ సభ్యులు ఆకారపు నరేష్, కోదండ చరణ్, కోరే రమేష్, రాజు, రైతులు ఇంద్రారెడ్డి, వింజమూరు పుల్లయ్య, బొజ్జ పుల్లయ్య, రంగారెడ్డి, ప్రసాద్ తదితరులు ఉన్నారు.